Ind Vs Eng: భారత్ ని కరుణించని వరుణుడు.."డ్రా"గా ముగిసిన మొదటి టెస్ట్

Sandeep Reddy
Published on: 8 Aug 2021 9:27 PM IST
India Vs England First Test Match Abandoned Fifth Day And Match Ends With Drawn
X

నాటింగ్ హోమ్ స్టేడియం (ట్విట్టర్ ఫోటో)

India Vs England Test Match: ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో భాగంగా భారత్ - ఇంగ్లాండ్ మధ్య నాటింగ్ హోమ్ వేదికగా జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ వర్షం కారణంగా అయిదో రోజు ఆట మొదలుకాకుండానే రద్దు అయింది. ఉదయం నుండి పడుతున్న వర్షంతో మ్యాచ్ ను అంపైర్లు రద్దు చేయడంతో మొదటి టెస్ట్ డ్రాగా ముగిసింది. నాలుగో రోజు బుమ్రా అద్భుత బౌలింగ్ తో ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ 303 పరుగులకు ఆలౌట్ అయి భారత్ పై 208 పరుగుల ఆధిక్యం సాధించింది. ఇక నాలుగో రోజు చివరి సెషన్ లో బ్యాటింగ్ దిగిన భారత్ 52/1 పరుగులతో రోహిత్ శర్మ, పూజార మ్యాచ్ ముగిసే సమయానికి గ్రీజులో ఉన్నారు.

ఐదో రోజు ఒక ఓవర్ కూడా వేయకుండానే వరుణుడు అడ్డంకి అయ్యాడు. ఇలా మొదటి టెస్ట్ మ్యాచ్ లో వర్షం కారణంగా రెండు, మూడు రోజుల్లో చివరి సెషన్లు రద్దు అవగా ఐదో రోజు మొత్తం వర్షం కారణంగా రద్దు అయింది. విజయానికి కేవలం 157 పరుగుల దూరంలో గెలుపు వాకిట్లో ఉన్న భారత్ కు ఇలా వరుణుడు విలన్ గా మారడంతో భారత క్రీడాభిమానులు నిరాశ చెందారు. ఇక మొదటి టెస్ట్ మ్యాచ్ మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ పొందాడు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story