India vs England 4th Test: చెత్త రికార్డుతో ధోనీ సరసన నిలిచిన కోహ్లీ

Arun Chilukuri
Published on: 5 March 2021 3:41 PM IST
Virat Kohli gets out for 0
X

చెత్త రికార్డుతో ధోనీ సరసన నిలిచిన కోహ్లీ

India vs England 4th Test: ఇప్పటికే పలు రికార్డులను సొంతం చేసుకుని, ప్రపంచ అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడిగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నిలిచాడు. తన కెరీర్ ముగిసేలోగా మరెన్ని రికార్డులు సాధిస్తాడో అని క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. మరోవైపు ఈరోజు కోహ్లీ ఒక చెత్త రికార్డును సాధించాడు.

మొతేరాలో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీ డకౌట్ అయ్యాడు. టీమిండియా కెప్టెన్‌గా కోహ్లీకి టెస్టుల్లో ఇది ఎనిమిదో డకౌట్. భారత మాజీ కెప్టెన్ ధోనీ కూడా టెస్టుల్లో ఎనిమిది సార్లు డకౌట్ అయ్యాడు. దీంతో, ఈ చెత్త రికార్డుతో ధోనీ సరసన కోహ్లీ చేరాడు. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే టెస్టుల్లో ఒకే సిరీస్‌లో రెండు సార్లు డకౌట్ కావడం కోహ్లీకి ఇది రెండో సారి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story