India Vs England 4th Test: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్

* ఐదు టెస్టుల సిరీస్‌లో 1-1తో సమంగా నిలిచిన ఇరు జట్లు

Sandeep Reddy
Updated on: 2 Sept 2021 3:27 PM IST
England Won The Toss Elected to Bowling in India vs England 4th Test
X

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్(ట్విట్టర్ ఫోటో)

India Vs England 4th Test: నేటి నుంచి భారత్, ఇంగ్లాండ్ మధ్య నాలుగో టెస్ట్ మరికాసేపట్లో ప్రారంభంకానుంది. ప్రస్తుతం టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జట్టులో రెండు మార్పులతో బరిలోకి దిగుతుండగా.., భారత జట్టు ఇషాంత్ శర్మ, షమీ స్థానంలో ఉమేష్ యాదవ్, శార్దుల్ టాగూర్ లకు నాలుగో టెస్ట్ లో అవకాశం కల్పించారు.

తొలి రెండు టెస్టుల్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన కోహ్లీసేన.. మూడో టెస్ట్‌లో మాత్రం దారుణంగా విఫలమైంది. చెత్త బ్యాటింగ్‌తో ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో చిత్తయింది. దాంతో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. ఇక గురువారం నుంచి ఓవల్ వేదికగా నాలుగో టెస్ట్ ప్రారంభంకానుంది. ఈసారి కోహ్లీ సేన పలు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.

భారత్ : రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, చటేశ్వర పూజార, అజింక్య రహనే, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, శార్దుల్ టాగూర్, ఉమేష్ యాదవ్, జస్ప్రిత్ బుమ్రా, సిరాజ్

ఇంగ్లాండ్ : రాయ్ బర్న్స్, హమీద్, జో రూట్, డేవిడ్ మలన్, పొప్, బేర్ స్టౌ, మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, ఓవర్టన్, రాబిన్సన్, అండర్సన్

Sandeep Reddy

Sandeep Reddy

Next Story