3rd T20: ఇంగ్లాండ్ వైపే టాస్: బ్యాటింగ్ ప్రారంభించనున్న ఇండియా

India vs Engalnd 3rd T20: నరేంద్రమోడీ స్టేడియంలో ఈరోజు ఇంగ్లాండ్, ఇండియా టీంల మధ్య 3వ టీ20 జరుగుతున్న సంగతి తెలిసిందే.

Venkata Chari
Updated on: 16 March 2021 6:56 PM IST
India vs Engalnd 3rd T20:Toss won by england, and choose bowling
X

ఇండియా, ఇంగ్లాండ్ ల మధ్య 3 వ టీట్వంటీ (ఫొటో ట్విట్టర్)

India vs Engalnd 3rd T20: అహ్మాదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియంలో ఈరోజు ఇంగ్లాండ్, ఇండియా టీంల మధ్య 3వ టీ20 జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్ టాస్ గెలిచి ఇండియాను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. అయితే ఇంగ్లాండ్ కెప్టెన్ మోర్గాన్ కు ఇది 100వ టీ20 మ్యాచ్. ఈ మ్యాచ్ లో గెలిచి ఇంగ్లాండ్ కెప్టెన్ కు ఘన బహుమతి ఇవ్వాలని ఇంగ్లాండ్ ప్లేయర్స్ అనుకుంటున్నారు.

ఇంగ్లాండ్ కెప్టెన్ మోర్గాన్ మాట్లాడుతూ, పిచ్ కొంత మంచుతో ఉన్నట్లుంది. కచ్చింతంగా ఈమ్యాచ్ లో గెలవాలని అనుకుంటున్నాం. అందు కోసం పోరాడతాం. ఇది మాకు చాలా స్పెషల్ డే. టీంలోకి మార్క్ వుడ్ చేరాడు అని అన్నాడు.

అనంతరం కోహ్లీ మాట్లాడుతూ.. మేం టాస్ గెలిచిన ఖచ్చితంగా బౌలింగ్ చేస్తాం. టాస్ ఓడిపోవడం కొంత నిరాశే.. అయినా ఫస్ట్ బ్యాటింగ్ మాకు చాలెంజ్ లాంటిది. రోహిత్ టీంలోకి రాగా.. సూర్యకుమార్ ను బెంచ్ కు పరిమితం చేశాం. కేఎల్ రాహుల్, ఇషాంత్ కిషన్ ఓపెనింగ్ చేస్తారని, రోహిత్ నం.3 లో బ్యాటింగ్ చేస్తాడని తెలిపాడు.

కాగా, మొదటి T20లో ఇంగ్లాండ్, రెండో T20లో ఇండియాల విజయం సాధించాయి. దీంతో 5 T20 సిరీస్ లో 1-1 తో సమానంగా ఉన్నాయి. దీంతో మూడో టీ20 ఇరు జట్లకు చాలా ముఖ్యం.

ఫైనల్ 11

ఇంగ్లాండ్: జాసన్ రాయ్, జోస్ బట్లర్ (కీపర్), డేవిడ్ మలన్, జానీ బెయిర్‌స్టో, ఎయోన్ మోర్గాన్ (కెప్టెన్), బెన్ స్టోక్స్, సామ్ కుర్రాన్, క్రిస్ జోర్డాన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్

ఇండియా: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), రిషబ్ పంత్ (కీపర్), శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, శార్దుల్ ఠాకూర్, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్

Venkata Chari

Venkata Chari

Next Story