సొంత గడ్డపై సత్తా చాటిన అశ్విన్‌

Arun Chilukuri
Published on: 15 Feb 2021 3:50 PM IST
సొంత గడ్డపై సత్తా చాటిన అశ్విన్‌
X

సొంత గడ్డపై సత్తా చాటిన అశ్విన్‌

ఇంగ్లాండ్‌తో రెండో టెస్టులో రవిచంద్రన్‌ అశ్విన్‌ శతకంతో మెరిశాడు. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌ విఫలమైన అశ్విన్‌ మాత్రం చెలరేగిపోయాడు. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాట్‌మెన్ తడబడినప్పటికీ అశ్విన్‌ ఇంగ్లండ్‌ బౌలర్లకు ధీటుగా సమాధానం చెప్పాడు. కష్టంగా మారుతున్న పిచ్‌పై గొప్ప ప్రదర్శన చేశాడు. మొయిన్‌ అలీ వేసిన 82వ ఓవర్లో ఒక సిక్స్‌, రెండు ఫోర్లు బాది 17 రన్స్‌ రాబట్టి శతకం పూర్తి చేశాడు.

సొంతమైదానంలో సెంచరీ చేయడంతో అశ్విన్‌ తనదైన స్టైల్‌లో సెలబ్రేషన్స్‌ చేసుకున్నాడు. టెస్టు కెరీర్‌లో అశ్విన్‌కిది ఐదో శతకం కావడం విశేషం. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు సాధించి కోలుకోలేని దెబ్బతీసిన అశ్విన్‌ బ్యాట్‌తోనూ రాణిస్తున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ 83 ఓవర్లలో 9 వికెట్లకు 276 పరుగులు చేసింది. ప్రస్తుతం అశ్విన్, సిరాజ్ క్రీజులో ఉన్నారు. భారత్‌ 471 పరుగుల ఆధిక్యంలో ఉంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story