Ind Vs Eng: అదే పిచ్ పై మీకు సమాధానం చెబుతాం..అండర్సన్ కి కోహ్లి కౌంటర్

Sandeep Reddy
Updated on: 4 Aug 2021 1:10 PM IST
India Vs England 2021: We Will Answer to England Team on The Same Pitch Virat Kohli Counter to James Anderson
X

విరాట్ కోహ్లి (ట్విట్టర్ ఫోటో) 

India Vs England - Virat Kohli: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి బుధవారం ఇంగ్లాండ్ తో జరగనున్న మొదటి టెస్ట్ మ్యాచ్ కు ముందురోజు మీడియాతో ముచ్చటించాడు. మంగళవారం భారత జట్టుపై పలు వ్యాఖ్యలు చేసిన జేమ్స్ అండర్సన్ పై కూడా విరాట్ ఈ సమావేశంలో స్పందించాడు. భారత జట్టు పర్యటనలో ఉన్నప్పుడు వారికి నచ్చినట్టుగా స్పిన్ కి అనుకూలంగా ఉండే పిచ్ లను తయారు చేసుకున్నారని, తాము కూడా ఈ సిరీస్ లో అలాగే మాకు పేస్ బౌలింగ్ కి అనుకూలంగా ఉండే విధంగా ఎక్కువగా పచ్చగడ్డితో ఉండే పిచ్ ని తయారు చేసుకున్నామనే వ్యాఖ్యలకు విరాట్ కోహ్లి తనదైన సమాధానం ఇచ్చాడు.

ప్రస్తుతం తమ బ్యాటింగ్ లైన్ అప్ బలంగానే ఉందని, జట్టులో ఠాకూర్ అటు బౌలింగ్ లోనే కాకుండా సమయం వచ్చినపుడు బ్యాటింగ్ లోను తన ప్రతిభ చూపిస్తాడని..ఇక ఇంగ్లాండ్ గడ్డపై ఇషాంత్ శర్మ, మహమ్మద్ షమీ వంటి బౌలర్స్ తమ పేస్ బౌలింగ్ తో ఇంగ్లాండ్ ఆటగాళ్ళను కట్టడి చేయగలరని చెప్పుకొచ్చాడు. ఇక అండర్సన్ వ్యాఖ్యలపై స్పందించిన కోహ్లి తమ అద్భుత ప్రదర్శనతో ఇంగ్లాండ్ జట్టుకు ఆ పిచ్ పైనే సమాధానం చెబుతామని కౌంటర్ ఇచ్చాడు. కోహ్లి-అండర్సన్ వ్యాఖ్యలతో మ్యాచ్ ముందు రోజే వాతావరణం వేడెక్కింది. ఇక నేడు జరగనున్న మ్యాచ్ తో ఏ జట్టు ఎంతవరకు రాణిస్తుందో.. వరుస విజయాలతో ఇంగ్లాండ్ తమ రికార్డును కాపాడుకుంటుందో లేదా భారత్ ఘన విజయాలు సాధించి టిమిండియా చరిత్ర తిరగరాస్తుందో లేదో చూడాలి

Sandeep Reddy

Sandeep Reddy

Next Story