India vs England: నాలుగో టెస్టుకు భారత్ జట్టులో రెండు మార్పులు

Arun Chilukuri
Updated on: 2 March 2021 6:16 PM IST
India vs England: నాలుగో టెస్టుకు భారత్ జట్టులో రెండు మార్పులు
X

నాలుగో టెస్టుకు భారత్ జట్టులో రెండు మార్పులు

India vs England: నాలుగో టెస్టుకి భారత్ జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది. మార్చి4 నుంచి మొతేరాలో ప్రారంభం కాబోతున్న టెస్టులో ఈసారి ముగ్గురు స్పిన్నర్లతో భారత్ జట్టు బరిలోకి దిగబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. నాలుగో టెస్టుకి బ్యాటింగ్ పిచ్‌ని తయారు చేస్తారని అంతా ఊహించారు. కానీ మళ్లీ స్పిన్ పిచ్‌నే క్యూరేటర్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

వ్యక్తిగత కారణాలతో నాలుగో టెస్టుకి ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా ఇప్పటికే దూరమవగా అతని స్థానంలో ఉమేశ్ యాదవ్ లేదా మహ్మద్ సిరాజ్ జట్టులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అలానే మూడో టెస్టులో కేవలం 4 బంతులు మాత్రమే బౌలింగ్ చేసి పెద్దగా బ్యాటింగ్ చేయని స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌పై వేటు వేసి ఎడమచేతి వాటం మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ని తుది జట్టులోకి భారత్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story