నేడు బంగ్లాదేశ్‌తో ఇండియా తొలి వన్డే

* రోహిత్ శర్మ సారధ్యంతో బంగ్లాదేశ్‌తో ఢీ... షమీ ప్లేస్‌‌‌‌లో ఉమ్రాన్‌‌‌‌.. బంగ్లా కెప్టెన్‌గా లిటన్​దాస్

R Tripura Malini
Published on: 4 Dec 2022 9:02 AM IST
India Vs Bangladesh 1st ODI
X

నేడు బంగ్లాదేశ్‌తో ఇండియా తొలి వన్డే

India Vs Bangladesh: నేటి నుంచే ఇండియా వర్సెస్‌ బంగ్లాదేశ్‌ వన్డే సిరీస్‌ ప్రారంభం కానుంది. భారత్‌తో బంగ్లాదేశ్ మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. ఇవాళ ఢాకా వేదికగా జరగనున్న తొలి వన్డేలో టీమిండియా సత్తా చాటేందుకు సమాయత్తమైంది. ఆటను మలుపుతిప్పగలిగే నైపుణ్యం గల ఆటగాళ్లున్న బంగ్లాదేశ్‌కు తక్కువగా అంచనా వెయ్యోద్దని రోహిత్ సేన భావిస్తోంది. రోహిత్ శర్మ సారధ్యంలో పటిష్టమైన బ్యాటింగ్ దళం, నైపుణ్యం గల బౌలర్లతో బంగ్లాదేశ్ పై, పైచేయి సాధించాలని సన్నాహాలు పూర్తి చేశారు. బంగ్లాదేశ్ కెప్టెన్ గా వికెట్ కిపర్ లిటన్ దాస్ సారధ్యం వహిస్తున్నారు. టీమిండియాను ఢీ కొట్టేందుకు వ్యూహాత్మకంగా జట్టును సిద్ధం చేశారు. బంగ్లాదేశ్ ఆటగాళ్లు సొంతగడ్డపై టీమిండియాకు షాక్ ఇచ్చేందుకు జవసత్వాలను కూడ గట్టుకున్నారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story