BCCI: టీ20 వరల్డ్ కప్‌కు టీమిండియా జట్టు ఖరారు..

India Squad For T20 World Cup 2022: టీ20 వరల్డ్ కప్ టీమ్‌ను బీసీసీఐ ఖరారు చేసింది.

Arun Chilukuri
Published on: 12 Sept 2022 6:51 PM IST
India Squad For T20 World Cup 2022 Announced
X

BCCI: టీ20 వరల్డ్ కప్‌కు టీమిండియా జట్టు ఖరారు..

India Squad For T20 World Cup 2022: టీ20 వరల్డ్ కప్ టీమ్‌ను బీసీసీఐ ఖరారు చేసింది. రోహిత్ శర్మ కెప్టన్‌గా పటిష్టమైన జట్టును బరిలోకి దింపబోతోంది. కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, వికెట్ కీపర్లుగా రిషబ్ పంత్, దినేశ్ కార్తిక్, ఆల్ రౌండర్లుగా హార్థిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, బౌలర్ల విభాగంనుంచి యుజువేంద్ర ‍ఛాహల్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్షదీప్ సింగ్‌లతో జట్టును ప్రకటించింది. స్టాండ్ బై ప్లేయర్లుగా మహ్మద్ షమీ, శ్రేయస్ అయ్యర్, రవిబిష్ణోయ్, దీపక్ ఛాహర్‌లను ఎంపిక చేసింది.

అక్టోబరు 16 తేదీన టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. టీ20 వరల్డ్ కప్ పోటీల్లో టీమిండియా, పాకిస్థాన్‌ల మధ్య అక్టోబరు 23 తేదీన హోరాహోరీ పోరు జరగబోతోంది. అక్టోబరు 30 తేదీన సౌతాఫ్రికాతో టీమిండియా తలపడబోతోంది. నవంబరు 2 తేదీన బంగ్లాదేశ్‌తో టీమిండియా పోటీ పడుతుంది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story