India Vs England T20 Series: భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ

India Vs England: భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ శనివారం అధికారికంగా ప్రకటించింది.

Samba Siva Rao
Updated on: 20 Feb 2021 9:51 PM IST
Team India T20 Squad
X

టీం ఇండియా ఫైల్ ఫోటో 

India Vs England: టీ20 సిరీస్‌లో ఇంగ్లాండ్‌పై తలపడే భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ శనివారం అధికారికంగా ప్రకటించింది. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోని 19మంది ప్లేయర్స్ కూడిన జట్టును బీసీసీఐ సీనియర్ సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ప్రస్తుతం భారత్ - ఇంగ్లాండ్ మద్య టెస్టు సిరీస్ జరుగుతోంది. టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత టీమిండియా- ఇంగ్లాండ్ మధ్య ఐదు టీ20ల సిరీస్ ఆరంభంకానుంది. రెండు జట్ల మధ్య టీ20 సిరీస్ మార్చి 12న ప్రారంభం కానుంది.

భారత్ జట్టు ఇదే

కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), భువనేశ్వర్ కుమార్, యజువేంద్ర చహల్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, టి.నటరాజన్, దీపక్ చహర్, నవదీప్ సైనీ, వాషింగ్టన్ సుందర్, రాహుల్ తెవాటియా, శార్దూల్ ఠాకూర్.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story