Pink Ball Test: 400 వికెట్ల క్లబ్ లో అశ్విన్

India Spinner Ashwin Becomes 2nd Fastest Bowler to Claim 400 Test wickets
x

అశ్విన్ (ఫోటో బీసీసీఐ ట్విట్టర్ )

Highlights

Pink Ball Test: భారత్, ఇంగ్లాండ్ ల మధ్య జరుగుతున్నమూడో టెస్టులో స్పిన్ బౌలర్ అశ్విన్ కొత్త మైలు రాయిని చేరుకున్నాడు.

Pink Ball Test: భారత్, ఇంగ్లాండ్ ల మధ్య నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్నమూడో టెస్టులో స్పిన్ బౌలర్ అశ్విన్ కొత్త మైలు రాయిని చేరుకున్నాడు. ఇంగ్లాండ్ ఆటగాడు ఆర్చర్ ని అవుట్ చేయడం ద్వార అశ్విన్ తన 400 వికెట్ల మైలు రాయిని చేరుకున్నాడు. టీం ఇండియా తరపున ఈ ఫీట్ అందుకున్న నాలుగో బౌలర్ గా గుర్తింపు సాధించాడు. అశ్విన్ కంటే ముందు కపిల్ దేవ్, కుంబ్లే, హరిభజన్ ఈ ఘనత సాధించారు.

అలాగే తక్కువ టెస్టుల్లో ఈ ఘనత సాధించిన వారిలో అశ్విన్ (77) రెండో స్థానంలో నిలిచాడు. అంతకు ముందు శ్రీలకం స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ కేవలం 72 టెస్టుల్లోనే 400 వికెట్ల క్లబ్ లో చేరాడు.

తక్కువ టెస్టుల్లో 400 వికెట్లు సాధించిన బౌలర్లు:

72 మురళీధర్

77 అశ్విన్

80 హాడ్లీ/ స్టెయిన్

84 హెరత్

85 కుంబ్లే


Show Full Article
Print Article
Next Story
More Stories