India vs England 4th T20: నిలవాలంటే గెలవాలి

India vs England 4th T20: ఇంగ్లాండ్ తో ఐదు టీ20ల సిరీస్ లో 1-2 తో వెనుకంజలో ఉంది టీమిండియా.

Venkata Chari
Updated on: 18 March 2021 6:53 PM IST
India Must Win in 4th T20 Against England
X

టీమిండియా ప్లేయర్స్ (ఫొటో ట్విట్టర్)

India vs England 4th T20: ఇంగ్లాండ్ తో ఐదు టీ20ల సిరీస్ లో 1-2 తో వెనుకంజలో ఉంది టీమిండియా. ఇక నేడు (గురువారం) జరిగే 4వ టీ20లో గెలవకపోతే ట్రోఫీని భారత్ చేజార్చుకుంటుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తేనే సిరీస్ లో నిలబడుతుంది. ఇప్పటి వరకు ముగిసిన మూడు టీ20ల్లోనూ టాస్ గెలిచి ఛేదనకు దిగిన జట్టే విజయం సాధించడం గమనార్హం. దాంతో.. ఈరోజు మ్యాచ్ లోనూ టాస్ కీలకంకానుంది.

ఈరోజు జరిగే మ్యాచ్ కోసం భారత జట్టులో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. భారత్ తుది జట్టులో కనీసం మూడు మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. మూడు టీ20ల్లోనూ 1, 0, 0 పరుగులతో తేలిపోయిన ఓపెనర్ కేఎల్ రాహుల్‌పై వేటు పడనుంది. అతని స్థానంలో మరో ఓపెనర్ శిఖర్ ధావన్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. అలానే ఫాస్ట్ బౌలర్ శార్ధూల్ ఠాకూర్‌ కూడా బెంచ్ కే పరిమితం చేసి, నవదీప్ సైనీని టీమ్‌లోకి తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక మిడిలార్డర్‌లో సూర్యకుమార్ యాదవ్‌ తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కీలక మ్యాచ్ కావడంతో బ్యాటింగ్ ఆర్డర్‌లోనూ మార్పులు జరిగేలా ఉన్నాయని సమాచారం. పవర్ హిట్టర్ హార్దిక్ పాండ్యా ముందుకు వచ్చే అవకాశం ఉంది.

మరోవైపు టీ20 ల్లో నంబర్ వన్ ఇంగ్లాండ్ టీం ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని ఆరాటపడుతోంది. ఇంగ్లాండ్ టీంలో పెద్దగా మార్పులు లేకపోవచ్చు.

భారత్ తుది జట్టు అంచనా: రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్) సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, నవదీప్ సైనీ, యుజ్వేందర్ చాహల్

Venkata Chari

Venkata Chari

Next Story