పాకిస్థాన్ కన్నా భారతే ప్రమాదకరం : పీసీబీ ఛైర్మన్ ఇషాన్‌

పాకిస్థాన్ కన్నా భారతే ప్రమాదకరం : పీసీబీ ఛైర్మన్ ఇషాన్‌
x
Eshan Mani File Photo
Highlights

భారత్ పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఛైర్మన్ ఇషాన్‌ మని సంచలన వ్యాఖ్యలు చేశాడు. పాకిస్థాన్‌ కన్నా భారతే ప్రమాదకరమని వ్యాఖ్యానించాడు.

భారత్ పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఛైర్మన్ ఇషాన్‌ మని సంచలన వ్యాఖ్యలు చేశాడు. పాకిస్థాన్‌ కన్నా భారతే ప్రమాదకరమని వ్యాఖ్యానించాడు. శ్రీలంక పాకిస్థాన్ టెస్ట్ మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన ఇషాన్ ..పాక్‌లో క్రికెట్‌ ఆడటం ప్రమాదకరం కాదు, అది మేము నిరూపించాం అన్నారు. అయితే పాకిస్తాన్ లో భద్రతాపరమైన ప్రమాదం ఉందని నిరూపించాలని సవాల్ చేశారు. శ్రీలంక జట్టు ఇక్కడ సిరీస్ ఆడిందని భద్రత విషయంపై ఎవరికి సందేహం అవసరం లేదు. పదేళ్ల తర్వాత పాక్‌లో టెస్టు క్రికట్‌ ఆడడం శుభపరిణామం. బంగ్లాదేశ్‌ జనవరిలో పాక్ లో పర్యటించడానికి ఆదేశ క్రికెట్ బోర్డుతో సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడించాడు.

ఇతర దేశాల క్రికెట్ బోర్డులతోనూ చర్చలు జరుపుతామని పేర్కొన్నాడు. బంగ్లాదేశ్ పాక్ లో పర్యటిస్తుందనే నమ్మకముంది. శ్రీలంక జట్టు పర్యటించిన తర్వాత వేరే జట్లు కూడా వస్తాయి అని ఇషాన్‌ తెలిపాడు. పాకిస్థాన్ లో సానుకూల వాతావరణం నెలకొందని పాక్‌ మీడియా, అభిమానులు ఎంతో సహకరించారు అని ఇషాన్ అన్నాడు. 2009లో పాకిస్థాన్‌లో పర్యటించిన శ్రీలంక జట్టు ప్రయాణిస్తన్న బస్సుపై ఉగ్రవాదులు దాడులు చేసిన విషయం తెలిసిందే.

అప్పటి నుంచి ఇప్పటి వరు ఆదేశంలో క్రికెట్ ఆడటానికి ఏ అంతర్జాతీయ జట్టు అంగీకరిచలేదు. అయితే తాజా శ్రీలంక క్రికెట్ జట్టు పాకిస్థాన్‌లో పర్యటించింది. మూడు టీ20లు , రెండు టెస్టులు ఆడింది. కరాచీ వేదికగా జరిగిన చివరి టెస్టులో 208పరుగుల తేడాలో శ్రీలంకపై పాకిస్థాన్ ఘన విజయం సాధించింది. దీంతో పాక్ 1-0తో సిరీస్ కైవసం చేసుకుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories