WTC Final: ఓడిన శ్రీలంక.. WTC ఫైనల్‌లో భారత్‌..!

World Test Championship: వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్లోకి ఇండియా వెళ్లింది.

Arun Chilukuri
Published on: 13 March 2023 1:01 PM IST
India Have Qualified for the World Test Championship Final
X

WTC Final: ఓడిన శ్రీలంక.. WTC ఫైనల్‌లో భారత్‌..!

World Test Championship: వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్లోకి ఇండియా వెళ్లింది. శ్రీలంకతో జ‌రిగిన టెస్టు మ్యాచ్‌లో న్యూజిలాండ్ విజ‌యం సాధించ‌డంతో.. ఇండియాకు లైన్ క్లియ‌ర్ అయ్యింది. దీంతో టెస్టు చాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్లో ఇండియా, ఆస్ట్రేలియా త‌ల‌ప‌డ‌నున్నాయి. డబ్ల్యూటీసీ 2021-23 ఫైనల్‌కు చేరాలనుకున్న శ్రీలంక ఆశలపై న్యూజిలాండ్‌ మాజీ సారధి కేన్‌ విలియమ్సన్‌ నీళ్లు చల్లాడు. స్వదేశంలో శ్రీలంకతో జరిగిన తొలి టెస్ట్‌లో అజేయమైన సూపర్‌ సెంచరీ సాధించిన కేన్‌(121), తన జట్టుకు అపురూప విజయాన్ని అందించడంతో పాటు శ్రీలంకను డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరకుండా అడ్డుకున్నాడు.

డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉంది. ప్రస్తుతం 68.52 శాతంతో ఆసీస్‌ ఉండగా.. భారత్ 60.29 శాతంతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఈ ఏడాది జూన్‌ 7 నుంచి 11 వరకు లండన్‌లోని ఓవల్‌ మైదానం వేదికగా భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జరుగనుంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story