ICC ODI Rankings: వన్డే ర్యాంకింగ్స్.. తన స్థానాన్ని నిలుపుకున్న టీమిండియా

ICC ODI Rankings: ఇంగ్లండ్‌పై వన్డే సిరీస్ కైవసం చేసుకున్నటీమిండియా.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో తన స్థానాన్ని పదిలపరుచుకుంది.

Arun Chilukuri
Updated on: 18 July 2022 8:30 PM IST
India Consolidate Third Spot in ICC ODI Rankings
X

ICC ODI Rankings: వన్డే ర్యాంకింగ్స్.. తన స్థానాన్ని నిలుపుకున్న టీమిండియా 

ICC ODI Rankings: ఇంగ్లండ్‌పై వన్డే సిరీస్ కైవసం చేసుకున్నటీమిండియా.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో తన స్థానాన్ని పదిలపరుచుకుంది. నిన్న మాంచెస్టర్‌లో జరిగిన మ్యాచ్‌లో పంత్ వీరోచిత సెంచరీ, పాండ్యా పోరాటం ద్వారా టీమిండియా అద్భుత విజయం సాధించింది. ఫలితంగా 2-1తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ఐసీసీ తాజా వన్డే ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. ఈ జాబితాలో 109 పాయింట్లతో టీమిండియా తన మూడో స్థానాన్ని నిలుపుకుంది.

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్ జట్టు నెంబర్ వన్‌గా కొనసాగుతోంది. కివీస్ ఖాతాలో 128 రేటింగ్ పాయింట్లు ఉండగా, 121 పాయింట్లతో ఇంగ్లండ్ రెండోస్థానంలో ఉంది. కాగా, టీమిండియా మరికొన్ని రోజుల్లో వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఇందులో గెలిస్తే టీమిండియా ఖాతాలో మరిన్ని రేటింగ్ పాయింట్లు చేరే అవకాశం ఉంది. టీమిండియా తర్వాతి స్థానాల్లో పాకిస్తాన్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు ఉన్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story