Ind vs Eng - Virat Kohli: బుమ్రా నా దగ్గరికి వచ్చి నేను చూసుకుంటానని బౌలింగ్ చేశాడు

India vs England - Virat Kohli: * ఈ మ్యాచ్ గెలుపుతో అయిదు టెస్ట్ సిరీస్ లో భాగంగా భారత్ 2-1 ఆధిక్యంలో ఉంది.

Sandeep Reddy
Published on: 7 Sept 2021 1:19 PM IST
India Captain Virat Kohli Says Our Bowlers did Great job in India vs England Fourth Test 2021
X

Jasprit Bumrah - Virat Kohli (Image Source: Twitter)

Virat Kohli: ఇంగ్లాండ్ - ఇండియా మధ్య జరిగిన నాలుగో టెస్ట్ లో ఘనవిజయం సాధించిన తరువాత భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి మీడియాతో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. మ్యాచ్ కి ముందు అందరం కలిసి మ్యాచ్ ఎలా గెలవాలో అని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామని అందులో ప్రస్తుతం కొందరు ఇక్కడ లేరని టీమిండియా కోచ్ రవి శాస్త్రి గురించి చెప్పుకొచ్చాడు. కరోనా పాజిటివ్ రావడంతో ప్రస్తుతం ఐసోలేషన్ లో రవిశాస్త్రి ఉన్న సంగతి తెలిసిందే. ఇక భారత జట్టులో రవీంద్ర జడేజా అద్భుతంగా బౌలింగ్ చేశాడని, రోహిత్ శర్మ సెంచరీ భారీ స్కోర్ చేయడానికి దోహదపడిందని విరాట్ తెలిపాడు.

గెలవడానికే మ్యాచ్ ఆడామని మా బౌలింగ్ లైన్ అప్ పై పూర్తి నమ్మకం ఉందని, వారి మెరుపు లాంటి బౌలింగ్ తోనే మ్యాచ్ ని గెలుపొందామన్నాడు. మ్యాచ్ సాగుతున్న సమయంలో బాల్ రివర్స్ స్వింగ్ అవడం మొదలైన తరువాత జస్ప్రిత్ బుమ్రా తన వద్దకు వచ్చి తాను చూసుకుంటానని చెప్పి బంతి తీసుకొని బౌలింగ్ చేశాడు. అద్భుతమైన స్పెల్ తో వికెట్స్ పడగొట్టి బుమ్రా మ్యాచ్ ని టర్న్ చేశాడని విరాట్ తెలిపాడు. ఇక శార్దుల్ టాగూర్ అటు బ్యాటింగ్ తోనే కాకుండా బౌలింగ్ లోను తన ప్రతిభని చూపించాడని మ్యాచ్ గెలవడానికి అందరు సమిష్టిగా కృషి చేశారని గ్రౌండ్ బైట మాట్లాడే మాటలు తాము పట్టించుకోమని భారత సారధి అన్నారు. ఈ మ్యాచ్ గెలుపుతో అయిదు టెస్ట్ సిరీస్ లో భాగంగా భారత్ 2-1 ఆధిక్యంలో ఉంది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story