Hockey Asia Cup 2025: సంచలన విజయం.. ఆసియా హాకీ కప్‌ను గెలుచుకున్న టీమిండియా!

Hockey Asia Cup 2025
x

Hockey Asia Cup 2025: సంచలన విజయం.. ఆసియా హాకీ కప్‌ను గెలుచుకున్న టీమిండియా!

Highlights

Hockey Asia Cup 2025: భారత హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. హర్మన్‌ప్రీత్ సింగ్ నాయకత్వంలో టీమిండియా 8ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలికింది.

Hockey Asia Cup 2025: భారత హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. హర్మన్‌ప్రీత్ సింగ్ నాయకత్వంలో టీమిండియా 8ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలికింది. బీహార్‌లోని రాజ్‌గీర్‌లో జరిగిన పురుషుల హాకీ ఆసియా కప్ ఫైనల్‌లో భారత్ జట్టు అద్భుతమైన ప్రదర్శనతో సౌత్ కొరియాను 4-1 తేడాతో ఓడించింది. ఈ విజయంతో భారత జట్టు నాల్గవసారి ఆసియా కప్ టైటిల్‌ను గెలుచుకుంది. ఈ ఘన విజయంతో 2026లో నెదర్లాండ్స్, బెల్జియంలో జరిగే FIH పురుషుల హాకీ ప్రపంచ కప్‌కు నేరుగా అర్హత సాధించింది. ఈ టోర్నమెంట్‌లో ఆరంభం నుంచే టీమిండియా విజేతగా నిలుస్తుందని అందరూ భావించారు. ఈ అంచనాలను నిజం చేస్తూ, కోచ్ క్రెయిగ్ ఫుల్టన్ ఆధ్వర్యంలో జట్టు అద్భుతంగా ఆడింది. టోర్నమెంట్‌లో ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోకుండా ఫైనల్‌కు చేరుకుంది. లీగ్ దశలో తమ మూడు మ్యాచ్‌లలో గెలిచింది. సూపర్-4 రౌండ్‌లోనూ మూడు మ్యాచ్‌లకు గాను రెండు గెలిచి, సౌత్ కొరియాతో ఒక మ్యాచ్‌ను 2-2తో డ్రా చేసుకుంది. ఈ డ్రా అయిన మ్యాచ్‌లోనే భారత జట్టు తమ సత్తా చూపింది.

సెప్టెంబర్ 7, ఆదివారం నాడు జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా దూకుడుగా ఆడింది. ఆట ప్రారంభమైన కేవలం 30 సెకన్లలోనే సుఖ్‌జీత్ సింగ్ తొలి గోల్ చేసి జట్టుకు మంచి ఆధిక్యాన్ని అందించాడు. మొదటి అర్ధభాగం ముగియడానికి రెండు నిమిషాల ముందు దిల్‌ప్రీత్ సింగ్ ఒక గోల్ చేసి స్కోర్‌ను 2-0కు పెంచాడురెండవ అర్ధభాగంలో సౌత్ కొరియా డిఫెన్స్‌ను ఛేదించడం కొంచెం కష్టమైనప్పటికీ, 45వ నిమిషంలో దిల్‌ప్రీత్ సింగ్ మరోసారి గోల్ చేసి స్కోర్‌ను 3-0కు తీసుకెళ్లాడు. ఈ గోల్‌తో సౌత్ కొరియా గెలుపు ఆశలు సన్నగిల్లాయి. 50వ నిమిషంలో అమిత్ రోహిదాస్ గోల్ చేసి భారత విజయాన్ని దాదాపుగా ఖాయం చేశాడు. సౌత్ కొరియా చివరి నిమిషాల్లో ఒక గోల్ చేసినప్పటికీ, అది కేవలం స్కోర్‌ను 4-1కు తగ్గించడానికి మాత్రమే ఉపయోగపడింది.

ఇది భారత హాకీ జట్టు ఆడిన తొమ్మిదవ ఆసియా కప్ ఫైనల్. ఈ విజయంతో, భారత్ నాలుగవసారి టైటిల్‌ను గెలుచుకుంది. భారత జట్టు చివరిసారిగా 2017లో గెలిచింది. ఆసియా కప్ టైటిల్‌లను ఎక్కువగా గెలుచుకున్న జట్టు సౌత్ కొరియా (5 సార్లు). ఈ ఫైనల్ విజయంతో భారత్, సౌత్ కొరియాపై 2-2తో సమంగా నిలిచింది. ఈ టోర్నమెంట్‌లో మునుపు జరిగిన మూడు ఫైనల్స్‌లో సౌత్ కొరియా రెండు, భారత్ ఒక ఫైనల్ గెలుచుకున్నాయి. ఈ విజయంతో టీమిండియా 2026 ప్రపంచ కప్‌కు అర్హత సాధించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories