IND Vs ZIM 2nd ODI: జింబాబ్వేను చిత్తు చేసిన టీమిండియా‌.. సిరీస్‌ కైవసం..!

IND Vs ZIM 2nd ODI: జింబాబ్వే టూర్‌లో టీమిండియా సత్తా చాటింది.

Arun Chilukuri
Published on: 20 Aug 2022 7:51 PM IST
India Beat Zimbabwe By 5 Wickets
X

IND Vs ZIM 2nd ODI: జింబాబ్వేను చిత్తు చేసిన టీమిండియా‌.. సిరీస్‌ కైవసం..!

IND Vs ZIM 2nd ODI: జింబాబ్వే టూర్‌లో టీమిండియా సత్తా చాటింది. 3 వ‌న్డేల వ‌న్డే సిరీస్‌ను ఇంకో మ్యాచ్ మిగిలిఉండ‌గానే, టీమిండియా చేజిక్కించుకుంది. రెండో వ‌న్డేలో జింబాబ్వే నిర్దేశించిన ల‌క్ష్యాన్ని టీమిండియా బ్యాట్స్‌మెన్లు కేవ‌లం 25.4 ఓవ‌ర్ల‌లోనే చేధించి విజ‌యం సాధించారు. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రాహుల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఫ‌స్ట్ బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే జ‌ట్టు 38.1 ఓవ‌ర్ల‌లో 161 ప‌రుగులు చేసి ఆలౌట్ అయ్యింది. ఆ త‌ర్వాత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా స‌గం ఓవ‌ర్ల‌లోనే ల‌క్ష్యాన్ని చేధించింది. శిఖ‌ర్ ధావ‌న్ 33 పరుగులతో, శుభ్‌మ‌న్ గిల్ 33, దీప‌క్ హుడా 25, వికెట్ కీప‌ర్ సంజూ శాంస‌న్ 43 పరుగులతో రాణించారు. 25.4 ఓవర్లు ముగిసేస‌రికి 5 వికెట్ల న‌ష్టానికి భార‌త జ‌ట్టు 167 ప‌రుగులు చేసి వ‌రుస‌గా రెండో విక్ట‌రీ కొట్టేసింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story