IND vs PAK: పాక్ భరతం పట్టిన టీమిండియా..7 వికెట్ల తేడాతో భారత్‌ ఘన విజయం..!

India Beat Pakistan
x

IND vs PAK: పాక్ భరతం పట్టిన టీమిండియా..7 వికెట్ల తేడాతో భారత్‌ ఘన విజయం.. 

Highlights

IND vs PAK: ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై భారత్ మరోసారి తిరుగులేని ఆధిపత్యాన్ని కనబర్చింది.

IND vs PAK: ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై భారత్ మరోసారి తిరుగులేని ఆధిపత్యాన్ని కనబర్చింది. అహ్మదాబాద్‌ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో భారత్‌ ఘన విజయం సాధించింది. 192 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌.. కేవలం 30.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (86; 63 బంతుల్లో) మరోసారి చెలరేగి ఆడాడు.

శ్రేయస్‌ అయ్యర్‌ అర్ధశతకం (53*; 62 బంతుల్లో)తో రాణించాడు. దీంతో 30.3 ఓవర్లలోనే భారత్‌ లక్ష్యాన్ని ఛేదించింది. పాక్‌ బౌలర్లలో షహీమ్‌ 2, హసన్‌ అలీ ఒక వికెట్‌ తీశారు. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన పాకిస్థాన్‌ 191 పరుగులకు ఆలౌట్‌ అయింది. బుమ్రా, సిరాజ్‌, హార్దిక్‌, కుల్‌దీప్‌, జడేజా తలో 2 వికెట్లు తీశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories