చివరి వన్డేలో టీమిండియా గ్రాండ్ విక్టరీ.. నంబర్‌ వన్‌ జట్టుగా టీమిండియా..

India Beat New Zealand India Won by 90 Runs
x

చివరి వన్డేలో టీమిండియా గ్రాండ్ విక్టరీ.. నంబర్‌ వన్‌ జట్టుగా టీమిండియా..

Highlights

India vs New Zealand: ఇండోర్ వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది.

India vs New Zealand: ఇండోర్ వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. 90 పరుగుల తేడాతో న్యూజిలాండ్ పై గెలిచింది. మూడు వన్డేల సిరీస్ ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. భారత్ విధించిన 386 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక 295 పరుగుల వద్ద కివీస్ ఆలౌటైంది. అంతకుముందు భారత్ భారీ స్కోర్ నమోదు చేసింది. 9 వికెట్లకు గాను 385 పరుగులు చేసి న్యూజిలాండ్ కు 386 పరుగులను లక్ష్యంగా పెట్టింది.

భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ లు సెంచరీలతో చెలరేగారు. పోటాపోటీగా సిక్సర్లు, బౌండరీలతో స్టేడియాన్ని హోరెత్తించారు. ముందుగా రోహిత్ 83 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. అనంతరం గిల్ కూడా 72 బంతుల్లో సెంచరీ సాధించాడు. మరోవైపు తాజా ఐసీసీ వన్డే టీమ్‌ ర్యాంకింగ్స్‌లో టీమిండియా అగ్రస్థానానికి ఎగబాకింది. ఈ మ్యాచ్‌కు ముందు మూడో స్థానంలో ఉండిన భారత్.. టాప్‌ ప్లేస్‌లో ఉన్న ఇంగ్లండ్‌ను వెనక్కు నెట్టి అగ్రపీఠాన్ని కైవసం చేసుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories