logo
క్రీడలు

IND vs AUS 3rd T20: హైదరాబాద్‌కు చేరుకున్న భారత్‌-ఆసీస్‌ ఆటగాళ్లు

India and Australia Teams Arrived Hyderabad
X

IND vs AUS 3rd T20: హైదరాబాద్‌కు చేరుకున్న భారత్‌-ఆసీస్‌ ఆటగాళ్లు

Highlights

IND vs AUS 3rd T20: ఇండియా, ఆస్ట్రేలియా క్రికెటర్లు హైదరాబాద్‌ చేరుకున్నారు.

IND vs AUS 3rd T20: ఇండియా, ఆస్ట్రేలియా క్రికెటర్లు హైదరాబాద్‌ చేరుకున్నారు. నాగపూర్‌ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వచ్చారు శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ కు క్రికెట్ ఫ్యాన్స్‌ భారీగా తరలివచ్చారు. క్రికెటర్లను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. తాజ్ కృష్ణ, పార్క్ హయత్ హోటల్స్‌లో ప్లేయర్స్ బసచేయనున్నారు. రేపు ఉదయం ఉప్పల్ స్టేడియం లో నెట్ ప్రాక్టీసులో క్రికెటర్స్ పాల్గొననున్నారు. రేపు రాత్రి 7.30 గంటలకు టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది. రేపటి టీ20 మ్యాచ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మ్యాచ్ కోసం 2500 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తోంది. 300కుపైగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసింది. వీటి ద్వారా మైదానంలోని ప్రతి వ్యక్తి కదలికలను పోలీసులు పర్యవేక్షించనున్నారు.

Web TitleIndia and Australia Teams Arrived Hyderabad
Next Story