IND vs SA 5th T20I: నిర్ణయాత్మకమైన ఐదో టీ20కి వరుణుడి ఆటంకం..!

IND vs SA 5th T20I: ఇవాళ బెంగళూరులో జరగనున్న ఐదో టీ-20 మ్యాచ్ పైనే అందరు దృష్టి సారించారు.

Arun Chilukuri
Published on: 19 Jun 2022 3:52 PM IST
IND vs SA 5th T20I, Will Rain Affect Series Decider?
X

IND vs SA 5th T20I: నిర్ణయాత్మకమైన ఐదో టీ20కి వరుణుడి ఆటంకం..!

IND vs SA 5th T20I: ఇవాళ బెంగళూరులో జరగనున్న ఐదో టీ-20 మ్యాచ్ పైనే అందరు దృష్టి సారించారు. తొలి రెండు ఢిల్లీ, కటక్ మ్యాచుల్లో సఫారీలు గెలుపొందగా విశాఖ, రాజ్‌కోట్‌ల్లో జరిగిన రెండు మ్యాచుల్లో టీమిండియా ఘన విజయం సాధించి సిరీస్ ను 2-2 సమం చేసింది. అయితే ఈ తుదిపోరుకు వరుణుడు ఆటంకి కలిగించే అవకాశం ఉంది. మ్యాచ్‌ జరిగే సమయంలో చిన్నస్వామి స్టేడియం ప్రాంతంలో ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.

ఇప్పటికే గత వారం రోజులుగా బెంగళూరులో కురుస్తోన్న వర్షం కారణంగా రంజీ ట్రోఫీలో మధ్యప్రదేశ్‌-బెంగాల్‌, ముంబయి-ఉత్తర్‌ ప్రదేశ్‌ మ్యాచ్‌లకు కూడా ఇబ్బంది కలిగింది. ప్రస్తుతం బెంగళూరులో ఉష్ణోగ్రత 28 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 84 శాతంగా రికార్డయింది. అదే విధంగా మ్యాచ్‌ సమయంలో తేమ 92 శాతం నుంచి 93 శాతం వరకు నమోదు అయ్యే ఛాన్స్‌ ఉంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story