IND vs PAK: పాక్ భరతం పట్టిన టీమిండియా.. 191పరుగులకే పాకిస్థాన్ ఆలౌట్..

IND vs PAK Indian Bowlers Restrict Pakistan for 191
x

IND vs PAK: పాక్ భరతం పట్టిన టీమిండియా.. 191పరుగులకే పాకిస్థాన్ ఆలౌట్..

Highlights

IND vs PAK: మోతేరా స్టేడియంలో భారత్ మోత మోగించింది. చిరకాల ప్రత్యర్థి..పాకిస్థాన్‌కు చుక్కలు చూపించింది.

IND vs PAK: మోతేరా స్టేడియంలో భారత్ మోత మోగించింది. చిరకాల ప్రత్యర్థి..పాకిస్థాన్‌కు చుక్కలు చూపించింది. భారత బౌలర్ల దాటికి.. పాక్ బ్యాటర్లు విలవిలలాడారు. ఒకరి వెనక ఒకరు చాప చుట్టేశారు. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్.. 191 పరుగులకే ఆలౌట్ అయింది. కేవలం 32 పరుగుల వ్యవధిలోనే 6వికెట్లు కోల్పోయింది. పాక్ ఆటగాళ్లో బాబర్ ఆజామ్, రిజ్వన్ మినహా మిగతా ఆటగాళ్లు అంతా.. నిరాశ పరిచారు. టాస్ గెలిచిన రోహిత్ సేన.. ఫిల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ కు దిగిన పాక్ ఓపెనర్లు ముందుగా రెచ్చిపోయారు. పిచ్ బ్యాటింగ్ కు అనుకూలించడంతో వరుస ఫోర్లతో దూకుడు కొనసాగించారు. అబ్దుల్లా షఫిక్ 20, ఇమామ్ ఉల్ హక్ 36పరుగులతో రాణించారు. కానీ ఆ తర్వాత ఒక్కసారిగా మ్యాచ్ టర్న్ తీసుకుంది.

మంచి దూకుడు మీద ఉన్న పాక్ ను.. హైదరాబాద్ ఆటగాడు సిరాజ్ తొలి దెబ్బ కొట్టాడు. సిరాజ్ బౌలింగ్‌ లో షఫిక్.. ఎల్బీగా వెనుదిరిగాడు. ఆ తర్వాత ఇంకో ఓపెనర్ ఇమామ్.. పాండ్యా బౌలింగ్‌లో కీపర్ క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన బాబర్, రిజ్వన్ కాస్త కుదురుకున్నట్టు కనిపించారు. ఇద్దరు.. 80పరుగుల పైనే పాట్నర్ షిప్ సాధించారు. ఇద్దరు క్రీజులో కుదురుకునే టైంలో.. సిరాజ్ మరోసారి మెరిశాడు. బాబర్ ను పెవిలియన్‌కు పంపాడు. అప్పటి నుంచి పాకిస్తాన్ పతనం స్టార్ట్ అయింది. ఆ తర్వాత వచ్చిన ఆటగాళ్లు అంతా.. తక్కువ స్కోర్ కే వచ్చినవాళ్లు వచ్చినట్టే వెనుదిరిగారు. టిమిండియా బౌలింగ్ దాటికి నిలువలేక.. 191పరుగులకే చాప చుట్టేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories