IND vs NZ Final: టీమిండియా సరికొత్త చరిత్ర.. టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో ఒకే ఒక్క టీమ్!
టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో అత్యధిక స్కోర్ సాధించిన జట్టుగా భారత్ రికార్డుల్లో నిలిచింది.
IND vs NZ Final: టీమిండియా సరికొత్త చరిత్ర.. టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో ఒకే ఒక్క టీమ్!
టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో అత్యధిక స్కోర్ సాధించిన జట్టుగా భారత్ రికార్డుల్లో నిలిచింది. టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై భారత్ 5 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసి ఈ రికార్డు సృష్టించింది. టీ20 వరల్డ్ కప్ ఫైనల్ చరిత్రలో ఇప్పటివరకు ఇదే అత్యధిక స్కోర్‌గా నిలిచింది. ఇదివరకు కూడా ఫైనల్‌లో అత్యధిక స్కోర్ల జాబితాలో భారత్ ముందంజలోనే ఉంది. 2024 టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై భారత్ 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. భారత్ తన రికార్డును తానే బద్దలు కొట్టింది.
2021 టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియా 173/2 స్కోర్ చేసింది. అదే మ్యాచ్‌లో న్యూజిలాండ్ కూడా 172/4 స్కోర్ నమోదు చేసింది. ఆ ఫైనల్ మ్యాచ్‌లో రెండు జట్లు కూడా భారీ స్కోర్లు చేయడం ప్రత్యేకంగా నిలిచింది. 2016 టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై వెస్టిండీస్ 161/6 స్కోర్ చేసింది. 2007లో జరిగిన తొలి టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత్ పాకిస్తాన్‌పై 157/5 స్కోర్ నమోదు చేసింది. టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లలో భారీ స్కోర్లు సాధించడం చాలా అరుదైన విషయం. అయినప్పటికీ ఈ జాబితాలో మూడు సార్లు భారత్ ఉండటం టీమిండియా బ్యాటింగ్ లోటును స్పష్టంగా చూపిస్తుంది.
2026 టీ20 ప్రపంచ కప్ ఫైనల్‌లో న్యూజిలాండ్‌కు భారత్ 256 పరుగుల లక్ష్యంను నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. ఓపెనర్ సంజు శాంసన్ (89) సెంచరీ చేజార్చుకున్నాడు. అభిషేక్ శర్మ (52), ఇషాన్ కిషన్ (54) అర్ధ శతకాలు చేశారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (0) డకౌట్ కాగా.. శివమ్ దూబే (26) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. తిలక్ వర్మ (8), హార్దిక్ పాండ్య (18) పరుగులు చేశారు. కివీస్ బౌలర్లలో నీషమ్ 3 వికెట్స్ పడగొట్టగా.. రచిన్, హెన్రీ చెరో వికెట్ తీశారు.
టీ20 ప్రపంచకప్ ఫైనల్లో అత్యధిక స్కోర్ల లిస్ట్:
# భారత్ - 2026లో న్యూజిలాండ్‌పై 255/5
# భారత్ - 2024లో దక్షిణాఫ్రికాపై 176/7
# ఆస్ట్రేలియా- 2021లో న్యూజిలాండ్‌పై 173/2
# న్యూజిలాండ్- 2021లో ఆస్ట్రేలియాపై 172/4
# వెస్టిండీస్- 2016లో ఇంగ్లాండ్‌పై 161/6
# భారత్ - 2007లో పాకిస్తాన్‌పై 157/5




