Shubman Gill: శుభ్‌మన్‌ గిల్‌ డబుల్‌ సెంచరీ.. కివీస్‌కు భారీ టార్గెట్‌..

IND vs NZ 1st ODI Shubman Gill Hits Double Century
x

Shubman Gill: శుభ్‌మన్‌ గిల్‌ డబుల్‌ సెంచరీ.. కివీస్‌కు భారీ టార్గెట్‌..

Highlights

Shubman Gill: శుభ్‌మన్‌ గిల్‌ డబుల్‌ సెంచరీ.. కివీస్‌కు భారీ టార్గెట్‌..

Shubman Gill: ఉప్పల్‌ వన్డేలో అద్బుతం జరిగింది. భారత బ్యాటర్ శుభ్‌మన్‌ గిల్‌ డబుల్ సెంచరీతో చెలరేగాడు. 145 బంతుల్లో 201 పరుగులు చేశాడు. 19 ఫోర్లు, 8 సిక్స్‌లతో రెచ్చిపోయాడు. గిల్ దాటికి కివీస్ బౌలర్లు విలవిల లాడారు. ‌208 పరుగులు చేసిన గిల్‌ ఆ తర్వాత ఔటయ్యాడు. వన్డేల్లో డబుల్‌ సెంచరీ చేసిన ఐదో ఆటగాడిగా శుభ్‎మన్ గిల్ రికార్డ్ క్రియేట్ చేశాడు. గిల్ బ్యాట్‎తో చేసిన విన్యాసాలను ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేశారు. సిక్సర్లు, ఫోర్ల మోతతో ఉప్పల్ స్టేడియం మర్మోగింది. గిల్‌ విధ్వంసం ధాటికి భారత్‌ నిర్ణీత ఓవర్లలో 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసింది.

రోహిత్‌ శర్మ (34), సూర్యకుమార్ యాదవ్‌ (31), హార్ధిక్‌ పాండ్యా (28) ఓ మోస్తరుగా రాణించగా.. విరాట్‌ కోహ్లి (8), ఇషాన్‌ కిషన్‌ (5), వాషింగ్టన్‌ సుందర్‌ (12), శార్దూల్‌ ఠాకూర్‌ (3) నిరాశపరిచారు. కివీస్‌ బౌలర్లలో హెన్రీ షిప్లే, డారిల్‌ మిచెల్‌ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. ఫెర్గూసన్‌, టిక్నర్‌, సాంట్నర్‌, తలో వికెట్‌ సాధించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories