ఇంగ్లండ్ తో రెండో టెస్ట్ లో టీమిండియా దూకుడు

ఇంగ్లండ్ తో రెండో టెస్ట్ లో టీమిండియా దూకుడు
x
Highlights

చెన్నై లో జరుగుతున్న రెండో టెస్టులో తొలి రోజున టీమిండియా 6 వికెట్లు కోల్పోయి 300 పరుగులు చేసింది. హిట్‌ మ్యాన్ రోహిత్‌ శర్మ 161 పరుగులు, వైస్‌...

చెన్నై లో జరుగుతున్న రెండో టెస్టులో తొలి రోజున టీమిండియా 6 వికెట్లు కోల్పోయి 300 పరుగులు చేసింది. హిట్‌ మ్యాన్ రోహిత్‌ శర్మ 161 పరుగులు, వైస్‌ కెప్టెన్‌ 67 పరుగులతో రాణించారు. రిషబ్‌ పంత్ 33 పరుగులు అక్షర్ పటేల్ 5 పరుగులు చేసి క్రీజులో ఉన్నారు. ఖాతా తెరవకుండానే మొదటి వికెట్ కోల్పోయిన భారత్.. ఆ తర్వాత పుంజుకుంది. టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ అజింక్య రహనే అద్భుత భాగస్వామ్యం భారత్‌ను పటిష్ట స్థితిలో పెట్టింది. ఓపెనర్ గిల్ డకౌట్ కాగా.. ఆ తర్వాత వరుస ఇంటర్వెల్స్‌లో పుజారా 20 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి నిరాశపరిచాడు. పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరాడు. వికెట్లు కోల్పోయిన భారత్‌ను రోహిత్ శర్మ అద్భుత సెంచరీతో ఆదుకున్నాడు. కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకోవడమే కాకుండా పటిష్ట స్థితిలో నిలబెట్టాడు. 131 బంతుల్లో శతకం సాధించిన రోహిత్ శర్మ రహానేతో కలిసి స్కోర్‌ను పరుగులు పెట్టించాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories