IND vs AUS Match: HRCకి చేరిన ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా హైదరాబాద్ మ్యాచ్ టికెట్ల లొల్లి..

IND vs AUS Match: హైదరాబాద్ క్రికెట్ ఆసోసియేషన్ (హెచ్‌సీఏ)పై హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు అందింది.

Arun Chilukuri
Published on: 20 Sept 2022 4:28 PM IST
IND vs AUS Match: Advocate Move HRC Over Stadium Tickets
X

IND vs AUS Match: HRCకి చేరిన ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా హైదరాబాద్ మ్యాచ్ టికెట్ల లొల్లి..

IND vs AUS Match: హైదరాబాద్ క్రికెట్ ఆసోసియేషన్ (హెచ్‌సీఏ)పై హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు అందింది. ఈ నెల 25న ఉప్పల్‌ స్టేడియంలో ఇండియా-ఆస్ట్రేలియా మధ్య టీ20 మ్యాచ్‌ జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌ సంబంధించిన టికెట్ల విక్రయాల్లో అవకతవకలు జరిగాయని హెచ్‌ఆర్సీని ఆశ్రయించారు హైకోర్టు లాయర్‌ సలీం. అక్రమంగా టికెట్లను బ్లాక్‌లో విక్రయిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని హెచ్‌ఆర్సీని కోరారు లాయర్ సలీం.

ఇక ఈ మ్యాచ్ కు సంబంధించిన టికెట్లను ఈ నెల 15న హైదరాబాద్ క్రికెట్ ఆసోసియేషన్ (హెచ్‌సీఏ) ప్రముఖ వెబ్ సైట్, యాప్ పేటియం ద్వారా విడుదల చేసింది. అయితే ఈ టికెట్లను కొనుగోలు చేసే సమయంలో అభిమానులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. రాత్రి 8 గంటల నుంచి టికెట్లను అమ్మకానికి ఉంచినా.. సర్వర్స్ మొరాయించడం వల్ల 10 గంటలకు బుక్ చేసుకునే వీలు దొరికింది. అప్పటికీ టికెట్స్ ను బుక్ చేసుకుందామని అభిమానులు ప్రయత్నించగా.. టికెట్లు పూర్తిగా అమ్ముడైపోయాయని చూసి షాక్ తిన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story