Ind vs Aus 2nd T20 : భారత్ ముందు భారీ టార్గెట్!

భారత్, ఆసీస్ జట్ల మధ్య సిడ్నీలో జరుగుతున్న రెండో టీ20 లో ఆసీస్ బాట్స్ మెన్స్ రెచ్చిపోయారు. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ఆసీస్ జట్టు నిర్ణిత 20 ఓవర్లలలో అయిదు వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది.

Krishna
Published on: 6 Dec 2020 3:43 PM IST
Ind vs Aus 2nd T20 : భారత్ ముందు భారీ టార్గెట్!
X

భారత్, ఆసీస్ జట్ల మధ్య సిడ్నీలో జరుగుతున్న రెండో టీ20 లో ఆసీస్ బాట్స్ మెన్స్ రెచ్చిపోయారు. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ఆసీస్ జట్టు నిర్ణిత 20 ఓవర్లలలో అయిదు వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాట్స్ మెన్స్ లో వేడ్(58), స్మిత్ (46), మ్యాక్ వెల్ (22), హెన్రిక్స్ (26) పరుగులు చేశారు. టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన ఆసీస్ జట్టుకు ఓపెనర్లు మాథ్యూ వేడ్‌, షార్ట్‌ మంచి శుభారంభాన్ని ఇచ్చారు. ఇద్దరు కలిసి మొదటి వికెట్ కి 47 పరుగులు జోడించారు. ఇక ఆ తర్వాత వచ్చిన స్మిత్, మాక్స్‌వెల్‌ రెచ్చిపోయి ఆడారు. చివర్లో హెన్రిక్స్‌ వరుస బౌండరీలు బాదడంతో అ జట్టు భారీ స్కోర్ చేయగలిగింది. భారత బౌలర్లలో నటరాజన్ రెండు వికెట్లు తీయగా, శార్దూల్ ఠాకూర్‌, చహల్ చెరో వికెట్ తీశారు.

Krishna

Krishna

Next Story