Ind vs Aus : టీంఇండియా గ్రాండ్ విక్టరీ

Ind vs Aus : టీంఇండియా గ్రాండ్ విక్టరీ
x
Highlights

ఇక ఆ తర్వాత వచ్చిన స్మిత్‌(12), మాక్స్‌వెల్‌(2) త్వరత్వరగానే ఔట్ అయ్యారు. దీనితో 75 పరుగులకే ఆసీస్ కీలకమైన మూడు వికెట్లను కోల్పోయింది. అయితే ఆ జట్టు ఓపెనర్ డీ ఆర్కీ షార్ట్‌ మాత్రం మరో వికెట్ పడకుండా జాగ్రతగా ఆడుతూ వచ్చాడు.

ఆసీస్ తో జరుగుతున్న మొదటి టీ20 మ్యాచ్లో భారత జట్టు ఆసీస్ పైన 11 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన భారత జట్టు నిర్ణిత 20 ఓవర్లలలో ఏడూ వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. ఆ తర్వాత 162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ కి ఓపెనర్లు ఫించ్‌, షార్ట్‌ మంచి శుభారంభాన్ని ఇచ్చారు. ఇద్దరు కలిసి వరుస బౌండరీలతో విరుచకపడ్డారు. ఈ ఓపెనర్లను విడగొట్టడానికి భారత బౌలర్లు శ్రమించాల్సి వచ్చింది. చాహర్‌ వేసిన ఏడో ఓవర్‌లో వరుస బంతుల్లో టీమ్‌ఇండియా ఫీల్డర్లు రెండు క్యాచ్‌లు వదిలేశారు. అయితే చాహల్‌ వేసిన 8వ ఓవర్‌ నాలుగో బంతికి భారీ షాట్‌ ఆడబోయిన ఫించ్‌(35) హార్దిక్‌ పాండ్య చేతికి చిక్కాడు. దీంతో ఆస్ట్రేలియా 56 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది.

ఇక ఆ తర్వాత వచ్చిన స్మిత్‌(12), మాక్స్‌వెల్‌(2) త్వరత్వరగానే ఔట్ అయ్యారు. దీనితో 75 పరుగులకే ఆసీస్ కీలకమైన మూడు వికెట్లను కోల్పోయింది. అయితే ఆ జట్టు ఓపెనర్ డీ ఆర్కీ షార్ట్‌ మాత్రం మరో వికెట్ పడకుండా జాగ్రతగా ఆడుతూ వచ్చాడు. అయితే నటరాజన్‌ వేసిన 15వ ఓవర్‌ చివరి బంతికి డీఆర్కీ షార్ట్‌(34) ఔటయ్యాడు. దీంతో ఆస్ట్రేలియా 113 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ కోల్పోయింది. ఇక ఆ తర్వాత వచ్చిన వేడ్‌ (7), హెన్రిక్స్‌ (30) పెద్దగా రాణించకపోవడంతో ఆ జట్టు నిర్ణిత 20 ఓవర్లలలో 150 పరుగులు మాత్రమే చేసింది. భారత బౌలర్లలలో చాహల్ (3/25), నటరాజన్‌ (3/30) అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. కాగా మూడు మ్యాచ్ ల టీట్వంటీ సిరీస్ లో భారత జట్టు 1-0 తో లీడ్ లో ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories