Ind vs NZ Match: ఆ స్టేడియంలో టాస్ గెలిస్తే మ్యాచ్ గెలిచినట్టే..!!

* అక్టోబర్ 31న ఆదివారం జరగబోయే భారత్ - న్యూజిలాండ్ మ్యాచ్‌లో మంచు ప్రభావం కీలకం కానుంది.

Sandeep Reddy
Published on: 30 Oct 2021 12:53 PM IST
Ind vs NZ Match: ఆ స్టేడియంలో టాస్ గెలిస్తే మ్యాచ్ గెలిచినట్టే..!!
X

T20 World Cup 2021 - Ind vs NZ Match: యూఏఈ వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2021 లో మ్యాచ్ ఫలితాలు మంచు ప్రభావం ఎక్కువగా ఉండటంతో టాస్ పై ఆధారపడి ఉన్నట్టుగా తెలుస్తుంది. అక్టోబర్ 31న ఆదివారం జరగబోయే భారత్ - న్యూజిలాండ్ మ్యాచ్‌లో మంచు ప్రభావం కీలకం కానుంది. దుబాయ్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన జట్టు కచ్చితంగా బౌలింగ్‌ ఎంచుకునే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే టాస్ గెలిచిన జట్టు దాదాపుగా మ్యాచ్ గెలిచినట్లేనని ఇటీవల జరిగిన మ్యాచ్ ఫలితాలను చూస్తే అర్ధమవుతుంది.

ఈ క్రమంలోనే టాస్ పెద్దగా కలిసిరాని భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ పరిస్థితి గురించి ఆలోచిస్తూ అభిమానులు తలలు పట్టుకుంటున్నారు. అంతేకాకుండా దుబాయ్ వేదికగా ఇప్పటి వరకు జరిగిన అన్ని మ్యాచ్‌లలో టాస్ గెలిచిన టీం గెలుపొందింది. టాస్‌ ఓడిన జట్లను మంచు ప్రభావం నట్టేటా ముంచింది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌, ఆస్ట్రేలియా-శ్రీలంక, పాక్-అఫ్గాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లోనూ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న జట్లు విజయాన్ని సాధించాయి.

ఇక భారత్ - న్యూజిలాండ్ మ్యాచ్ లో కూడా టాస్ గెలిచిన జట్టే తప్పక విజయాన్ని సాధిస్తుందని పలువురు క్రీడాపండితులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మొదటి మ్యాచ్ పాక్ చేతిలో ఓటమి చవిచూసిన టీమిండియా న్యూజిలాండ్ తో జరగబోయే మ్యాచ్ లోనైనా పుంజుకొని సెమీఫైనల్ కు చేరాలని పట్టుదలతో ఉంది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story