ICC Womens World Cup: పాక్ ను చిత్తు చేసిన మిథాలీ టీమ్..

ICC Womens World Cup: మహిళా క్రికెట్ ప్రపంచకప్ వన్డే పోటీల్లో టీమిండియా సత్తా చాటింది.

Arun Chilukuri
Updated on: 6 March 2022 9:00 PM IST
ICC Womens World Cup: పాక్ ను చిత్తు చేసిన మిథాలీ టీమ్..
X

ICC Womens World Cup: పాక్ ను చిత్తు చేసిన మిథాలీ టీమ్..

ICC Womens World Cup: మహిళా క్రికెట్ ప్రపంచకప్ వన్డే పోటీల్లో టీమిండియా సత్తా చాటింది. న్యూజిలాండ్ మౌంట్ మాంగావి బే ఓవల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో ఇండియా జట్టు పాకిస్థాన్ మహిళా జట్టుపై విజయభేరి మోగించింది. 107 పరుగుల తేడాతో ఘనవిజయాన్ని సాధించింది. టాస్ గెలిచిన మిథాలీరాజ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఆటలో తొలి బంతినుంచి ఆఖరి బంతిదాకా హుషారైన ఆటతీరుతో ఆకట్టుకున్నారు. పరుగులు రాబట్టుకునే ప్రయత్నంలో పూజా వస్త్రాకర్, స్నేహారాణా, స్మృతి మంధాన, దీప్తీ శర్మ అద్భుతమైన ఆటతీరుతో రాణించారు. నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లను కోల్పోయిన మిథాలి సేన 244 పరుగులు చేసి పాక్ జట్టుకు 245 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

పూజా వస్త్రాకర్ 59 బంతులు ఎదుర్కొని 8 బౌండరీలతో 67 పరుగులు సాధించి టాప్ స్కోరర్ గా నిలిచారు. స్నేహా రాణా 48 బంతుల్లో నాలుగు బౌండరీలతో 53 పరుగులు అందించి అజేయంగా నిలించింది. స్మృతి మంధాన 75 బంతులు ఎదుర్కొని మూడు బౌండరీలు, ఒక సిక్సర్ తో 52 పరుగులు అందించారు. ఇక పాక్ జట్టు 137 పరుగులకే చేతులు ఎత్తేసింది. దీంతో మిథాలీ సేన విజయం సులభమైపోయింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story