ఇదే ప్రపంచంలో అత్యంత సుందరమైన క్రికెట్ స్టేడియం అంటున్న ఐసీసీ!

ప్రపంచంలోనే అత్యంత సుందరమైన క్రికెట్ స్టేడియం సిద్ధం అవుతోందని ఐసీసీ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

K V D Varma
Published on: 4 Feb 2021 9:45 AM IST
Worlds beautiful cricket stadium in Beluchisthan
X
ప్రపంచంలోనే అందమైన క్రికెట్ స్టేడియం (ఐసీసి ట్విట్టర్ ఇమేజెస్)

క్రికెట్ స్టేడియం లలో అందమైన స్టేడియం ఏదని క్రికెట్ అభిమానులను అడిగితే ఏం చెబుతారు? ఎక్కువ మంది లార్డ్స్ అని చెబుతారు. అలాగే కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్.. హిమాలయాల దగ్గరలోని ధర్మశాల అని చెబుతారు. అదే నిజం కూడా. కానీ, ఇవేవీ కాదు మరింత అందమైన క్రికెట్ స్టేడియం ఒకటి రూపుదిద్దుకుంటోంది అంటోంది అంతర్జాతీయ క్రికెట్ సమాఖ్య (ఐసీసీ).

ఐసీసీ ఇటీవల ట్విట్టర్ లో ఒక పోస్ట్ చేసింది. దాని ప్రకారం ప్రపంచంలోనే అత్యంత సుందరమైన క్రికెట్ స్టేడియం ఒకటి సిద్ధం అవుతోంది. ఇండియాకు పొరుగునే ఉన్న బెలూచిస్థాన్ లో గ్వాదర్ క్రికెట్ స్టేడియం నిర్మితమవుతోంది. తాజాగా ఈ స్టేడియంకు సంబంధించిన ఫోటోలు ఐసీసీ ట్వీట్ చేసింది. ''ఈ గ్రౌండ్ కన్నా మరింత అందంగా కనిపించే చిత్రమేదైనా ఉంటే చూద్దాం'' అంటూ కామెంట్ పెట్టింది. దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది.

పలువురు క్రికెట్ అభిమానులు.. 'నిజంగానే ఇది అత్యంత అందమైన స్టేడియం'' అంటూ కామెంట్లు పెడుతున్నారు ఈ ట్వీట్ పై. ఒకవైపు ఎత్తయిన పర్వతం, మరోవైపు నగరం, ఇంకోవైపు ఖాళీ స్థలంతో ఉన్న గ్వాదర్ క్రికెట్ స్టేడియం ఆకట్టుకునే విధంగా కనిపిస్తోంది. నిర్మాణ దశలోనే ఇంత పేరు సంపాదించిన ఈ స్టేడియం పూర్తయ్యేసరికి ఇంకెంత సుందరంగా ముస్తాబవుతుందో అని క్రికెట్ అభిమానులు అంటున్నారు.

K V D Varma

K V D Varma

Next Story