ICC Test Rankings: టెస్టుల్లో రోహిత్ శర్మ కెరీర్ బెస్ట్ ర్యాంకు

Arun Chilukuri
Published on: 28 Feb 2021 3:15 PM IST
ICC Test Rankings: టెస్టుల్లో రోహిత్ శర్మ కెరీర్ బెస్ట్ ర్యాంకు
X

ICC Test Rankings: టెస్టుల్లో రోహిత్ శర్మ కెరీర్ బెస్ట్ ర్యాంకు

ICC Test Rankings: టెస్టుల్లో భారత బ్యాట్స్‌మెన్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కెరీర్ బెస్ట్ ర్యాంకు సాధించాడు. రెండో టెస్టుల్లో అద్భుత సెంచరీతో పాటు మూడో టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 91 పరుగులు చేసిన రోహిత్ శర్మ, ఐసీసీ ప్రకటించిన టెస్టు బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో 8వ స్థానాన్ని సాధించాడు. రెండు టెస్టుల పర్ఫామెన్స్ కారణంగా రోహిత్ ఏకంగా 6 ర్యాంకులు ఎగబాకడం విశేషం 8వ ర్యాంకులో ఉన్న భారత టెస్టు స్పెషలిస్టు ప్లేయర్ ఛతేశ్వర్ పూజారా, రెండు ర్యాంకులు పడిపోయి 10వర్యాంకులో కొనసాగుతున్నాడు. భారత సారథి విరాట్ కోహ్లీ 5వ ర్యాంకులో ఉన్నాడు. పింక్ బాల్ టెస్టులో ఏడు వికెట్లు తీసిన అశ్విన్, బౌలర్ల ర్యాంకింగ్స్‌లో టాప్ 3లోకి ఎంట్రీ ఇచ్చాడు. మూడో టెస్టులో వికెట్లు తీయలేకపోయిన బుమ్రా, ఒకస్థానం దిగజారి 9వ స్థానంలో కొనసాగుతున్నాడు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story