ICC Test Rankings: బౌలింగ్‌లో అశ్విన్‌ ఒక్కడే నిలిచాడు!

ICC Test Rankings: ఐసీసీ నేడు(బుధవారం) ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో ఇండియా నుంచి అశ్విన్ మాత్రమే చోటు సంపాదించాడు.

Venkata Chari
Updated on: 12 May 2021 10:15 PM IST
ICC Test Rankings Only Aashwin in Top 10 From India
X

అశ్విన్ (ఫొటో ట్విట్టర్)

ICC Test Rankings: ఐసీసీ నేడు(బుధవారం) ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో ఇండియా నుంచి అశ్విన్ మాత్రమే చోటు సంపాదించాడు. పాక్‌ బౌలర్లు మాత్రం ర్యాకింగ్స్‌లో తమ సత్తా చాటారు. హసన్‌ అలీ, షాహిన్‌ ఆఫ్రిది, నుమాన్‌ అలీలు తమ కెరీర్‌ బెస్ట్‌ను చేరుకున్నారు. హసన్‌ అలీ 6 స్థానాలు ఎగబాకి 14వ స్థానంలో నిలిచాడు. షాహిన్‌ ఆఫ్రిది ఏకంగా 9 స్థానాలు ఎగబాకి 22వ స్థానంలో నిలిచాడు. నుమాన్‌ అలీ 8 స్థానాలు ఎగబాకి 46వ స్థానం చేరుకున్నాడు.

కాగా, జింబాబ్వేతో జరిగిన టెస్టు సిరీస్‌ను పాకిస్థాన్ 2-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. దీంట్లో వీరి ముగ్గురి పాత్ర కీలకంగా మారింది. ఒకే మ్యాచ్‌లో ఈ ముగ్గురు బౌలర్లు 5 వికెట్లు తీయడం విశేషం. ఒకే జట్టుకు చెందిన ముగ్గురు బౌలర్లు ఒకే మ్యాచ్‌లో 5 వికెట్లు తీయడం 28 ఏళ్ల తర్వాత మళ్లీ జింబాబ్వే మ్యాచ్‌లోనే కావడం విశేషం.

టీం ఇండియా నుంచి రవిచంద్రన్‌ అశ్విన్‌ ఒక్కడే టాప్‌టెన్‌లో ఉన్నాడు. అశ్విన్‌ 850 పాయింట్లతో రెండో స్థానాన్ని నిలబెట్టుకోగా.. బుమ్రా 11వ స్థానంలో నిలిచాడు. ఇక తొలి స్థానంలో కమిన్స్‌(908 పాయింట్లు), నీల్‌ వాగ్నర్‌( 825 పాయింట్లు) 3వ స్థానంలో నిలిచాడు. ఇక బ్యాటింగ్‌ విభాగంలో కేన్‌ విలియమ్సన్‌ తొలి స్థానంలో నిలిచాడు. టీమిండియా నుంచి కోహ్లి, రిషబ్‌ పంత్‌, రోహిత్‌ శర్మలు ఐదు, ఆరు, ఆరు స్థానాల్లో కొనసాగుతున్నారు.


Venkata Chari

Venkata Chari

Next Story