ICC Rankings: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో భారత్ చేజారిన తొలి ర్యాంకు

ICC Rankings: India Slip Down to 3rd in ICC Test Team Rankings
x

ICC Rankings: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో భారత్ చేజారిన తొలి ర్యాంకు

Highlights

ICC Rankings: ఇండియన్ క్రికెట్ టీమ్‌కు మరో బిగ్ షాక్ తగిలింది.

ICC Rankings: ఇండియన్ క్రికెట్ టీమ్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. తాజాగా ఐసీసీ విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్ లో టీమిండియా మూడో ర్యాంకు కు దిగజారింది. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టెస్టుల సిరీస్ ను 1-2తో కోల్పోవడం, యాషెస్ సిరీస్ లో 4-0 తేడాతో ఇంగ్లండ్‌ను ఆస్ట్రేలియా మట్టికరిపించడంతో భారత్ ర్యాంకు పడిపోయింది. తాజా ర్యాకింగ్స్‌లో 119 రేటింగ్ పాయింట్లతో ఆస్ట్రేలియా మొదటి స్థానంలో నిలిచింది.

ఇక 3-1తో సిరీస్‌ను గెలిచిన సౌతాఫ్రికా 101 రేటింగ్ పాయింట్లతో ఐదో స్థానానికి ఎగబాకింది. 117 పాయింట్లతో టెస్ట్ చాంపియన్స్ న్యూజిలాండ్ రెండో స్థానాన్ని కాపాడుకుంది. మరోవైపు పాకిస్థాన్ ఒక స్థానాన్ని కోల్పోయి 93 పాయింట్లతో ఆరో ర్యాంకులో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో శ్రీలంక, వెస్టిండీస్, బంగ్లాదేశ్, జింబాబ్వే, ఆఫ్ఘనిస్థాన్, ఐర్లాండ్‌లు కొనసాగుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories