ICC Rankings: టాప్‌ టెన్‌లో టీం ఇండియా నుంచి ఒక్కడే!

ICC Rankings: ఈ రోజు (బుధవారం) ఐసీసీ వన్డే బౌలింగ్ లో ర్యాంకులను విడుదల చేసింది.

Venkata Chari
Updated on: 26 May 2021 8:15 PM IST
ICC ODI Ranking Release
X

జస్ప్రీత్‌ బుమ్రా (ఫొటో ట్విట్టర్)

ICC Rankings: ఈ రోజు (బుధవారం) ఐసీసీ వన్డే బౌలింగ్ లో ర్యాంకులను విడుదల చేసింది. కాగా, టీం ఇండియా నుంచి టాప్‌-10లో ఒక్క భారత బౌలర్‌కు మాత్రమే చోటు దక్కించుకున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లకు దూరంగా ఉన్న టీమ్ఇండియా పాస్ట్ బౌలర్‌ జస్ప్రీత్‌ బుమ్రా 5వ స్థానానికి పడిపోయాడు.

ఇక అగ్ర స్థానంలో న్యూజిలాండ్‌ పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ కొనసాగుతున్నాడు. బంగ్లాదేశ్‌ స్పిన్నర్‌ మెహిడీ హసన్ మిరాజ్‌ రెండో స్థానం చేరుకున్నాడు. ఇదే మెహిడీ హసన్‌ మిరాజ్‌కు కెరీర్‌లో ఉత్తమ ర్యాంక్. ఇటీవల శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచుల్లో అద్భుతంగా రాణించడంతో మూడు స్థానాలు ఎగబాకి సెకండ్ ప్లేస్‌ చేరుకున్నాడు. దీంతో ఈ ఘనత సాధించిన బంగ్లాదేశ్ మూడో బైలర్‌గా రికార్డులకెక్కాడు. మరో బంగ్లాదేశ్‌ బౌలర్‌ ముస్తాఫిజుర్‌ రెహమన్‌ తొమ్మిదో స్థానం దక్కించుకున్నాడు.

ఇక, వన్డే బ్యాటింగ్ లో పాకిస్థాన్‌ బ్యాట్స్‌మన్‌ బాబర్‌ అజామ్‌ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లి రెండు, ఓపెనర్‌ రోహిత్‌ శర్మ మూడో స్థానంలో కొనసాగుతున్నారు.


Venkata Chari

Venkata Chari

Next Story