టీంఇండియా ఆటగాళ్లకి ఐసీసీ జరిమానా!

టీంఇండియా ఆటగాళ్లకి ఐసీసీ జరిమానా!
x
Highlights

నిన్నపెర్త్ వేదికగా ఇండియా, ఆసీస్ జట్ల మధ్య జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లో స్లో ఓవర్ రేటు కారణంగా టీం ఇండియా ఆటగాళ్లకి ఐసీసీ జరిమానా విధించింది. ఐసీసీ నిబంధనల ప్రకారం ప్లేయర్ మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధిస్తున్నట్టుగా ప్రకటించింది.

నిన్నపెర్త్ వేదికగా ఇండియా, ఆసీస్ జట్ల మధ్య జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లో స్లో ఓవర్ రేటు కారణంగా టీం ఇండియా ఆటగాళ్లకి ఐసీసీ జరిమానా విధించింది. ఐసీసీ నిబంధనల ప్రకారం ప్లేయర్ మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధిస్తున్నట్టుగా ప్రకటించింది. దీనికి కోహ్లి కూడా సరేనని ఒప్పుకున్నట్టుగా శనివారం ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. టీమిండియా నిర్ణీత స‌మ‌యంలో ఒక ఓవ‌ర్ త‌క్కువ‌గా వేసింది. దీంతో ఐసీసీ మ్యాచ్ రిఫ‌రీల ఎలైట్ ప్యానెల్‌కు చెందిన డేవిడ్ బూన్ ఈ జరిమానా విధించిన‌ట్లు పేర్కొంది. ఇక అటు ఆస్ట్రేలియా కేటాయించిన టైంలో ఓవర్లను పూర్తి చేసిందని పేర్కొంది. ఇక ఈ మ్యాచ్ లో 66 ప‌రుగుల‌తో ప‌రాజ‌యం పాలైంది. ఈ గెలుపుతో సిరిస్ లో ఆసీస్‌ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో వన్డే ఆదివారం సిడ్నీ మైదానంలో జరుగుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories