ICC T20 Rankings: టాప్‌లో మలాన్..కోహ్లీ ర్యాంక్ ఎంతంటే

ICC T20 Rankings: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) మెన్స్ టీ20 ర్యాంకుల జాబితాను ప్రకటించింది.

Samba Siva Rao
Updated on: 29 April 2021 12:41 PM IST
ICC Announce T20 Rankings
X

విరాట్ కోహ్లీ పాత చిత్రం

ICC T20 Rankings: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) మెన్స్ టీ20 ర్యాంకుల జాబితాను ప్రకటించింది. టీ20ల్లో భారత జట్టు సారథి విరాట్ కోహ్లీ 5వ స్థానంలో కొనసాగుతున్నాడు. టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్‌ కోహ్లి ర్యాంక్‌లో మార్పులేదు. మరో భారత బ్యాట్స్‌మన్‌ కేఎల్‌ రాహుల్‌ 7వ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. జింబాబ్వేతో జరిగిన సిరీస్‌లో రాణించిన పాకిస్తాన్‌ ఓపెనర్‌ రిజ్వాన్‌ పదో స్థానానికి ఎగబాకాడు.

ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మన్‌ మలాన్‌ అగ్రస్థానంలో ఉండగా ఫించ్‌ (ఆస్ట్రేలియా) రెండు, బాబర్‌ ఆజమ్‌ (పాకిస్తాన్‌) మూడు స్థానాల్లో ఉన్నారు. పాకిస్తాన్‌ ఓపెనర్‌ రిజ్వాన్‌ పదో స్థానానికి ఎగబాకాడు.


Samba Siva Rao

Samba Siva Rao

Next Story