MS Dhoni Fan Chacha Chicago : ధోని రిటైర్మెంట్ .. ఇక క్రికెట్ చూడనంటున్న పాక్ అభిమాని!

MS Dhoni Fan Chacha Chicago : ఇండియన్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ప్రపంచవ్యాప్తంగా హర్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు.. అందులో పాకిస్తాన్ కి

Krishna
Published on: 18 Aug 2020 12:41 PM IST
MS Dhoni Fan Chacha Chicago : ధోని రిటైర్మెంట్ .. ఇక క్రికెట్ చూడనంటున్న పాక్ అభిమాని!
X
Dhoni, Chacha Chicago

MS Dhoni Fan Chacha Chicago : ఇండియన్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ప్రపంచవ్యాప్తంగా హర్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు.. అందులో పాకిస్తాన్ కి చెందిన మహ్మద్‌ బషీర్‌ బొజాయ్‌ అలియాస్‌ 'చాచా చికాగో' ఒకరు.. మ్యాచ్ ఎక్కడైనా సరే.. ధోని జెర్సీ వేసుకోని బషీర్‌ బొజాయ్‌ మ్యాచ్ కి అటెండ్ అవుతాడు. 2011లో జరిగిన ప్రపంచకప్ లో భారత్, పాక్ మ్యాచ్ లో బషీర్ కి టికెట్ దొరకలేదు. కానీ అప్పుడు ధోనీనే బషీర్ కి టికెట్ పంపాడు.. ఇదని కాదు చాలా సార్లు ధోని అతనికి టికెట్ పంపించాడు.. అయితే తాజాగా ధోని తన అంతర్జాతీయ క్రికెట్ కి వీడ్కోలు పలకడంతో ఈ అభిమాని వేదనకి గురయ్యాడు... ఇక తానూ కూడా రిటైర్‌ అవుతున్నానని, ఇక క్రికెట్‌ చూడనని వెల్లడించాడు..

ధోని క్రికెట్ కి వీడ్కోలు పలకడం పట్ల బషీర్‌ బొజాయ్‌ స్పందిస్తూ.. '' ధోని ఆటకు గుడ్‌బై చెప్పడం నాకు ఎంతో వేదనకు గురి చేస్తోంది. గొప్ప ఆటగాళ్లందరూ ఏదో రోజు వీడ్కోలు చెప్పాల్సిందే. అది సహజం కూడా కానీ ధోని ఘనంగా రిటైర్‌ కావాల్సిన అర్హత కలవాడు.. ఇలా వీడ్కోలు పలకడం నన్ను ఎంతో బాధిస్తుంది. కరోనా తగ్గిన తర్వాత ధోని ఇంటికి వెళ్లి అతణ్ని అభినందిస్తాను. ఐపీఎల్‌లో అతని ఆటను చూడాలని ఉంది కానీ ప్రస్తుతం ప్రయాణాలపై ఆంక్షలు ఉండడంతో సాధ్యం కావడం లేదు" అని బషీర్‌ బొజాయ్‌ వెల్లడించాడు.

దాదాపుగా 16ఏళ్ళు టీంఇండియా జట్టుకు విశేషమైన సేవలను అందించాడు ధోని.. వాస్తవానికి గత ఏడాది జరిగిన ప్రపంచకప్ తర్వాత ధోని తన అంతర్జాతీయ క్రికెట్ కి వీడ్కోలు పలుకుతాడని అందరూ భావించారు కానీ అలా జరగలేదు.. ప్రపంచకప్ తర్వాత ధోని దాదాపుగా జట్టుకు ఏడాది పాటు దూరంగా ఉన్నాడు. ఇక ఎవరు ఉహించిన విధంగా నిన్న రిటైర్మెంట్ ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకొని అందరికి షాక్ ఇచ్చాడు.. ఇక కేవలం ధోని ఐపీఎల్ లో మాత్రమే ధోని ఆడనున్నాడు.

Krishna

Krishna

Next Story