రాహుల్‌కు క్షమాపణలు చెప్పా: మాక్స్‌వెల్‌

రాహుల్‌కు క్షమాపణలు చెప్పా: మాక్స్‌వెల్‌
x
Highlights

ఇటివల యూఏఈలో జరిగిన ఐపీఎల్‌ 13వ సీజన్‌లో రాహుల్ కెప్టెన్ గా ఉన్న పంజాబ్ జట్టు తరుపున ఆడిన మాక్స్‌వెల్‌ పూర్తిగా విఫలం అయ్యాడు. కానీ నిన్న ఇండియా జట్టుతో జరిగిన మ్యాచ్ లో మాత్రం భారత్ పైన మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.

టీంఇండియా జట్టుతో నిన్న జరిగిన తొలి వన్డేలో కేఎల్ రాహుల్ కి క్షమాపణలు చెప్పినట్టుగా అసీస్ ఆటగాడు మాక్స్‌వెల్‌ అన్నాడు. ఇటివల యూఏఈలో జరిగిన ఐపీఎల్‌ 13వ సీజన్‌లో రాహుల్ కెప్టెన్ గా ఉన్న పంజాబ్ జట్టు తరుపున ఆడిన మాక్స్‌వెల్‌ పూర్తిగా విఫలం అయ్యాడు. కానీ నిన్న ఇండియా జట్టుతో జరిగిన మ్యాచ్ లో మాత్రం భారత్ పైన మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు మాక్స్‌వెల్‌. దీనితో కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ పై నెటిజన్లు వీపరితంగా జోకులు పేలుస్తున్నారు. వీళ్ల బ్యాటింగ్‌ చూశాక రాహుల్ ఎలా ఉంటాడనే దానిపై సరదాగా మీమ్స్‌ చేశారు.

అయితే ఇది మాక్స్‌వెల్‌ దృష్టికి రావడంతో తానూ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు వికెట్ల వెనుక ఉన్న రాహుల్ కి క్షమాపణలు చెప్పినట్టుగా మాక్స్‌వెల్‌ తెలిపాడు. ఇక మొత్తం 13 ఐపీఎల్‌ మ్యాచ్‌ల్లో మాక్స్‌వెల్‌ కేవలం108 పరుగులు మాత్రమే చేశాడు. టోర్నీ మొత్తంలో ఒక్క సిక్సర్‌ కూడా కొట్టలేకపోవడం గమనార్హం. అటు మొదటి వన్డేలో భారీ పరుగులు సాధించిన ఫించ్‌, స్టీవ్‌స్మిత్‌ లు కూడా ఐపీఎల్‌ 13వ సీజన్‌లో ఆకట్టుకోలేకపోయారు.

ఇక నిన్నజరిగిన మొదటి వన్డేలో ముందుగా బ్యాటింగ్ దిగిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణిత 50 ఓవర్లలో 374 [పరుగులు చేసింది. ఆ తరవాత లక్ష్య చేదనకి దిగిన ఇండియా జట్టు నిర్ణిత 50 ఓవర్లలలో ఎనమిది వికెట్లు కోల్పోయి 308 పరుగులు చేసింది. దీనితో 66 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య(90: 76 బంతుల్లో 7ఫోర్లు, 4సిక్సర్లు), ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌(74: 86 బంతుల్లో 10ఫోర్లు) పోరాడినప్పటికీ ఇండియా జట్టుకు ఓటమి తప్పలేదు. ఈ గెలుపుతో సిరిస్ లో ఆసీస్‌ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో వన్డే ఆదివారం సిడ్నీ మైదానంలో జరుగుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories