టీ 20 మ్యాచ్‌పై తప్పుడు సమయం.. HCAపై మరో కేసు నమోదు..

Hyderabad Cricket Association: HCAపై మరో కేసు నమోదైంది.

Arun Chilukuri
Published on: 28 Sept 2022 10:56 AM IST
Hyderabad Police Registers One More Case Against HCA
X

టీ 20 మ్యాచ్‌పై తప్పుడు సమయం.. HCAపై మరో కేసు నమోదు..

Hyderabad Cricket Association: HCAపై మరో కేసు నమోదైంది. ఈ నెల 22న జింఖానా గ్రౌండ్స్‌లో జరిగిన తొక్కిసలాట సందర్భంగా HCAపై మూడు కేసులు నమోదయ్యాయి. తాజాగా మరో కేసు నమోదైంది. ఈ నెల 25వ తేదీన ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఇండియా, అస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్‌కు సంబంధించిన సమయాన్ని టికెట్లపై తప్పుగా ముద్రించారని బేగంపేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ నెల 25న రాత్రి ఏడు గంటలకే మ్యాచ్ ప్రారంభమైంది. అయితే టికెట్లపై రాత్రి ఏడున్నర గంటలకు మ్యాచ్ ప్రారంభం కానున్నట్టుగా సమయం ముద్రించారని బేగంపేట పీఎస్‌లో కేసు నమోదు చేశారు. దీంతో మొత్తంగా నాలుగు కేసులు HCAపై నమోదయ్యాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story