Jwala Gutta : ప్రియుడితో గుత్తా జ్వాలా నిశ్చితార్ధం!

Jwala Gutta : ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాలా విజయాలతోనే కాకుండా వివాదాలతో కూడా వార్తల్లో నిలుస్తూ వస్తుంది.

Krishna
Published on: 7 Sept 2020 2:22 PM IST
Jwala Gutta : ప్రియుడితో గుత్తా జ్వాలా నిశ్చితార్ధం!
X

Vishnu Vishal gets engaged to girlfriend Jwala Gutta 

Jwala Gutta : ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాలా విజయాలతోనే కాకుండా వివాదాలతో కూడా వార్తల్లో నిలుస్తూ వస్తుంది. తమిళ నటుడు విష్ణు విశాల్ తో గుత్తా జ్వాలా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. విశాల్ సోదరి సంగీత్ వేడుకలో వీరిద్దరికీ మొదటిసారి పరిచయం ఏర్పడగా ఆ తర్వాత అది ప్రేమగా మారింది. ఇక ప్రస్తుతం డేటింగ్ లో ఉన్న వీరు త్వరలో త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

తాజాగా వీరికి నిశ్చితార్ధం అయింది. గుత్తా జ్వాలా పుట్టనరోజునే ఎంగేజ్మెంట్ గా మార్చేశాడు విశాల్ .. ఆమె చేతికి రింగ్ పెట్టి మరింతగా సప్రైజ్ చేశాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ లో షేర్ చేసిన విష్ణు.. " జ్వాలా నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.. ఇది మన జీవితానికో కొత్త ప్రారంభం.. ఆశావహంగా ఉంటూ మన, మన కుటుంబాల మంచి భవిష్యత్తు కోసం కలిసి పనిచేద్దాం" అంటూ పోస్ట్ చేశాడు. కొత్త ప్రారంభానికి అందరి దీవెనలు కావాలని విష్ణు విశాల్ కోరాడు.. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇందులో గుత్తా జ్వాలా చేతికి రింగ్ ఉంది.. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక సోమవారం నాటికి గుత్తా జ్వాలాకి 37 ఏళ్లు నిండాయి..

ఇక విష్ణు విశాల్ కి ఇప్పటికే పెళ్లిన సంగతి తెలిసిందే.. రజినీ నటరాజ్‌ ని 2011లో పెళ్లి చేసుకున్న విష్ణు ఏడేళ్ళ తరవాత అంటే 2018లో విడిపోయారు. ఈ దంపతులకి నాలుగేళ్ళు కుమారుడు కూడా ఉన్నాడు. ఇక అటు గుత్తా జ్వాలా కూడా మరో బ్యాడ్మింటన్ ప్లేయర్ చేతన్ ఆనంద్‌ను 2005లో ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తరవాత ఇద్దరి మధ్య విబేధాలు రావడంతో 2011లో విడిపోయారు.



Krishna

Krishna

Next Story