దేశం పేరు మార్చండి.. ప్రధాని మోడీకి క్రికెటర్‌ షమీ 'భార్య' అభ్యర్ధన..

Mohammed Shami: టీమిండియా స్టార్‌ బౌలర్‌ మొహమ్మద్ షమీ భార్య హసిన్ జహాన్ మరోసారి వార్తల్లో నిలిచింది.

Arun Chilukuri
Published on: 15 Aug 2022 4:05 PM IST
Hasin Jahan Appeal That pm Should Change the Name of India
X

దేశం పేరు మార్చండి.. ప్రధాని మోడీకి క్రికెటర్‌ షమీ ‘భార్య’ అభ్యర్ధన..

Mohammed Shami: టీమిండియా స్టార్‌ బౌలర్‌ మొహమ్మద్ షమీ భార్య హసిన్ జహాన్ మరోసారి వార్తల్లో నిలిచింది. గతంలో తన భర్త తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడంటూ షమీపై ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఈసారి ఏకంగా భారత దేశం పేరునే మార్చాలంటూ ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలకే రిక్వెస్ట్ పెట్టింది.

ప్రస్తుతం వాడుకలో ఉన్న 'ఇండియా' పేరు మార్చి 'భారత్' లేదా 'హిందుస్తాన్' అని పెట్టండి. వీటితో మనకు దక్కాల్సిన గుర్తింపు దక్కుతుంది..' అని రాసుకొచ్చింది. వీడియోలో జహాన్‌ మరో ఇద్దరితో కలిసి ప్రముఖ బాలీవుడ్ గీతం 'దేశ్ రంగీలా' పాటకు నృత్యం చేస్తూ కనిపిస్తుంది. జహాన్‌ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్‌లో ఉంది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story