Haris Rauf: బౌలింగ్ కంటే గాలిపటాలు ఎగరేయడమే బాగా వచ్చు.. పాక్ పేసర్ రవూఫ్పై ఫ్యాన్స్ ఫైర్!

Haris Rauf: పాకిస్థాన్ స్పీడ్ స్టర్ హారిస్ రవూఫ్ ప్రస్తుతం వరుస ఎదురుదెబ్బలతో వార్తల్లో నిలుస్తున్నారు.
Haris Rauf: పాకిస్థాన్ స్పీడ్ స్టర్ హారిస్ రవూఫ్ ప్రస్తుతం వరుస ఎదురుదెబ్బలతో వార్తల్లో నిలుస్తున్నారు. మైదానంలో అభ్యంతరకర ప్రవర్తన కారణంగా ఐసీసీ నిషేధానికి గురైన ఈ పేసర్, ఇప్పుడు ఏకంగా టీ20 ప్రపంచ కప్ జట్టులోనే స్థానం కోల్పోయారు. అయితే, జట్టుకు దూరమైనా ఏమాత్రం చింత లేకుండా ఆయన ఎంజాయ్ చేస్తున్న తీరుపై పాక్ క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు.
వివాదాస్పద సైగలు.. ఐసీసీ కఠిన చర్యలు!
గతంలో ఆసియా కప్లో భారత్తో జరిగిన మ్యాచ్ సందర్భంగా హారిస్ రవూఫ్ చేసిన సైగలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. 'ఆపరేషన్ సిందూర్' పేరుతో భారత యుద్ధ విమానాలను నేలకూల్చామంటూ మైదానంలో సంకేతాలివ్వడం వివాదాస్పదమైంది. క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించిన రవూఫ్పై సీరియస్ అయిన ఐసీసీ, అతనిపై రెండు మ్యాచ్ల నిషేధం విధించింది. ఈ వివాదాల నేపథ్యంలోనే ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ జట్టులోనూ అతనికి చోటు దక్కలేదు.
గాలిపటాలు ఎగురవేస్తూ ఎంజాయ్.. ఫ్యాన్స్ ఫైర్!
జట్టులో చోటు పోయిందని బాధపడతాడని భావించిన అభిమానులకు రవూఫ్ షాకిచ్చారు. తన స్నేహితులతో కలిసి ఎంతో ఉల్లాసంగా గాలిపటాలు ఎగురవేస్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రవూఫ్ తీరును తీవ్రంగా ఎండగడుతున్నారు.
"బౌలింగ్ చేయడం కంటే గాలిపటం ఎగురవేయడమే నీకు బాగా వచ్చు" అంటూ కొందరు వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తుండగా..
"దేశం కోసం ఆడాలనే కనీస బాధ్యత కూడా లేదు" అని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రపంచ కప్ వంటి మెగా టోర్నీకి దూరమై కూడా ఇలా వినోదాల్లో మునిగిపోవడాన్ని పాక్ క్రికెట్ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి.
Haris Rauf and Hassan Ali enjoying basant in Lahore 🪁#Basant2026 pic.twitter.com/JzSsy4TSOj
— Ahtasham Riaz (@ahtashamriaz22) February 7, 2026

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



