logo
క్రీడలు

Hardik Pandya: వరల్డ్ కప్ గెలవడమే నా తదుపరి లక్ష్యం

Hardik Pandya wants to win the World Cup for India
X

Hardik Pandya: వరల్డ్ కప్ గెలవడమే నా తదుపరి లక్ష్యం

Highlights

Hardik Pandya: కెప్టెన్‌గా గుజరాత్ టైటాన్స్‌కు ఐపీఎల్ టైటిల్‌ను సొంతం చేసుకున్న హార్థిక్ పాండ్యా తన తదుపరి లక్ష్యం టీ20 ప్రపంచ కప్‌లో భారత్‌ను గెలిపించడమే అని స్పష్టం చేశాడు.

Hardik Pandya: కెప్టెన్‌గా గుజరాత్ టైటాన్స్‌కు ఐపీఎల్ టైటిల్‌ను సొంతం చేసుకున్న హార్థిక్ పాండ్యా తన తదుపరి లక్ష్యం టీ20 ప్రపంచ కప్‌లో భారత్‌ను గెలిపించడమే అని స్పష్టం చేశాడు. కీలకమైన మూడు వికెట్లు అందులో ఐపీఎల్ సీజన్‌లోనే అత్యథిక పరుగులు సాధించిన జోస్ బట్లర్ వికెట్‌ను తీయడం ద్వారా ఆ జట్టును తక్కువ స్కోరుకు ఫైనల్‌లో కట్టడి చేసినట్లు పాండ్యా తెలిపాడు. భారత్ కోసం ప్రపంచ కప్‌ను సాధించి పెట్టడమే తన తదుపరి లక్ష్యమని పాండ్యా తెలిపాడు.

తన దగ్గర ఉన్నదంతా ఇవ్వబోతున్నానని జట్టే ప్రథమం అని భావించే ఆటగాడినని తెలిపాడు. తన జట్టు విజయం సాధించడమే తన లక్ష్యమని దేశానికి ప్రాతినిథ్యం వహించడం అంటే ఆనందిస్తా అన్నాడు. దీర్ఘకాలం అయినా స్పల్పకాలం అయినా ఏం జరిగినా ప్రపంచకప్‌ను గెలవడమే తన గోల్ అన్నాడు హార్థిక్ పాండ్యా.

Web TitleHardik Pandya wants to win the World Cup for India
Next Story