Hardik Pandya: గుర్తుపెట్టుకోండి.. టీ20 ప్రపంచకప్ మనమే గెలవబోతున్నాం

Sandeep Reddy
Updated on: 30 Aug 2021 11:30 AM IST
Hardik Pandya Says Team India Will Win T20 World Cup 2021
X

హార్దిక్ పాండ్య (ట్విట్టర్ ఫోటో)

Hardik Pandya: టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య.. భారత క్రికెట్ జట్టులో అతి తక్కువ సమయంలోనే కీలక ఆటగాడిగా మారడమే కాకుండా తనదైన శైలిలో అటు బ్యాటింగ్ తోనే కాకుండా ఇటు బౌలింగ్ లోనూ విధ్వంసకర ఆటతో ప్రత్యర్ధి జట్టుకు చెమటలు పట్టించే సత్తా ఉన్న ఆటగాడు. తాజాగా హార్దిక్ పాండ్య త్వరలో జరగబోయే ఐపీఎల్, టీ20 ప్రపంచకప్ ల గురించి కొన్ని ఆసక్తికర విషయాలను ఒక ఇంటర్వ్యూలో భాగంగా పంచుకున్నాడు. ముంబై ఇండియన్స్ జట్టులో కీలక ఆటగాడైన హార్దిక్ సెప్టెంబర్ 19 నుండి జరగబోయే రెండో దశ ఐపీఎల్ లో తమ జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచి ఆరవసారి ఐపీఎల్ టైటిల్ ని గెలుచుకుంటామని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఐపీఎల్ తరువాత ప్రారంభం అయ్యే టీ20 ప్రపంచకప్ ని కూడా భారత జట్టు గెలువబోతుందని జోస్యం చెప్పాడు.

ప్రస్తుతం భారత జట్టు పొట్టి క్రికెట్ లో పటిష్టంగా ఉందని అటు బ్యాటింగ్ లోనే కాకుండా భువనేశ్వర్, సిరాజ్, షమీలతో బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగా ఉందని హార్దిక్ తెలిపాడు. ఇక ఇటీవల జరిగిన శ్రీలంక టూర్ లో తన బ్యాటింగ్, బౌలింగ్ ప్రదర్శనతో ఆకట్టుకోలేని హార్దిక్ పాండ్య త్వరలో జరగనున్న ఐపీఎల్, ప్రపంచకప్ లలో తన ప్రదర్శనతో ఎంతవరకు జట్టును గెలిపిస్తాడో.. అభిమానులను మెప్పిస్తాడో చూడాల్సిందే. సెప్టెంబర్ 19న ముంబై ఇండియన్స్ జట్టుతో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story