Hardik Pandya: ధోని నాకు పెద్దన్న.. నాకోసం కింద పడుకున్నాడు

* ధోని నాకు పెద్దన్న : హార్దిక్ పాండ్య * నాకు అండగా ఉండే ఏకైక వ్యక్తి ధోని: హార్దిక్ పాండ్య

Sandeep Reddy
Updated on: 19 Oct 2021 2:21 PM IST
Hardik Pandya Says Dhoni Sacrificed his bed for me in New Zealand Tour
X

Hardik Pandya: ధోని నాకు పెద్దన్న.. నాకోసం కింద పడుకున్నాడు

Hardik Pandya: భారత క్రికెట్ జట్టు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య తాజాగా ఒక ప్రముఖ స్పోర్ట్స్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిపై ప్రశంసల వర్షం కురిపించాడు. తాను ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా ధోని భాయ్ ఒక్కడే నన్ను ప్రశాంతంగా ఉంచుతాడని, ధోని తనకు పెద్దన్నలాంటి వాడని హార్దిక్ చెప్పుకొచ్చాడు. మొదటి నుండి తనని అర్ధం చేసుకున్న ఏకైక వ్యక్తి మహి భాయ్ అని తెలిపాడు. రెండేళ్ళ క్రితం ఒక ఛానల్ లో నేను మహిళలపై చేసిన అసభ్యకర వ్యాఖ్యల కారణంగా విమర్శల పాలైనపుడు కూడా ధోని ధైర్యం చెప్పాడన్నాడు.

ఆ సమయంలో న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న నన్ను భారత జట్టు నుండి వేటు వేసి తనకు హోటల్ రూమ్ కూడా కేటాయించలేదని, అప్పుడు ధోని తన రూమ్ కి పిలిచి అతడి బెడ్ ఇచ్చాడని తెలిపాడు. తనకి బెడ్ పై పడుకోవడం అంతగా అలవాటు లేదని నన్ను ఒప్పించి ధోని కిందపడుకున్నాడని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం జరగుతున్న టీ20 ప్రపంచకప్ తన కెరీర్ లో ఎంతో కీలకమైనదని, ఫినిషర్ గా ధోని లేకపోవడంతో ఆ బాధ్యత తనపై ఉందని శాయశక్తులా జట్టు గెలుపు కోసం కృషి చేస్తానని హార్దిక్ పాండ్య తెలిపాడు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story