Hardik Pandya: సోమనాథ్ ఆలయంలో హార్దిక్ పాండ్యా పూజలు

Hardik Pandya: ముంబై జట్టు గెలుపొందలంటూ పూజలు

Shashank Gullapelli
Published on: 6 April 2024 1:05 PM IST
Hardik Pandya Puja At Somnath Temple
X

Hardik Pandya: సోమనాథ్ ఆలయంలో హార్దిక్ పాండ్యా పూజలు

Hardik Pandya: ఐపీఎల్ లో ముంబై జట్టు గెలుపొందాలంటూ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా గుజరాత్ లోని సోమనాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. గుజరాత్ టీం కెప్టెన్ గా అద్భుత విజయాలు అందుకున్న పాండ్యా ముంబై ఇండియన్స్ కెప్టెన్సీగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. తొలుత గుజరాత్ చేతిలో ఓడిన ముంబై ఇండియన్స్ ఆ తర్వాత హైదరాబాద్ చేతిలోనూ పరాజయం చవి చూశారు. ఈ క్రమంలో హార్దిక పాండ్యా ఓ రేంజ్ లో అభిమానుల నుంచి ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వచ్చింది. గ్రౌండ్ లోనూ హార్ధిక్ పాండ్యాకు రోహిత్ అభిమానుల నుంచి హేళన తప్పడం లేదు.

మరో వైపు పాండ్యా సారథ్యంలో వరుసగా ముంబై జట్టు మూడు మ్యాచ్ లు ఓడిపోవడంతో కెప్టెన్సీ నుంచి తొలగించే విషయంపై చర్చ జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో జ్యోతిర్లింగాల్లో ఒకటైన సోమనాథ్ ఆలయాన్ని హార్దిక పాండ్యా సందర్శించారు. సంప్రదాయ దుస్తుల్లో మహాశివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ముంబైలోని వాంఖడే స్డేడియంలో రిషబ్ పంత్ సారధ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగే మ్యాచ్ లో హర్ధిక పాండ్యా మరో సారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story