Hardik Pandya: అప్పటివరకు నేను టీమిండియాకి ఆడను.. నన్ను జట్టులోకి తీసుకోవద్దు

* పూర్తి ఫిట్ నెస్ తరువాతే భారత జట్టు తరపున మ్యాచ్ లు ఆడుతా: హార్దిక్

Sandeep Reddy
Published on: 30 Nov 2021 12:30 PM IST
Hardik Pandya Decided Play For Team India When He Gets Full Fitness Only
X

Hardik Pandya: అప్పటివరకు నేను టీమిండియాకి ఆడను.. నన్ను జట్టులోకి తీసుకోవద్దు

Hardik Pandya: టీమిండియా ఆటగాడు హార్దిక్ పాండ్య గత కొంతకాలంగా తన బ్యాటింగ్, బౌలింగ్ లో విఫలమవుతూ విమర్శల పాలవుతున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ తో పాటు ఇటీవల జరిగిన టీ20 ప్రపంచకప్ 2021లో సైతం తన ఆటతీరుతో హార్దిక్ పాండ్య అంతగా ఆకట్టుకోలేకపోయాడు. తన ఫామ్ పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న తరుణంలో హార్దిక్ పాండ్య తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. తాను పూర్తి ఫిట్ నెస్ సాధించేవరకు ఎలాంటి టోర్నమెంట్ కి ఎంపిక చేయొద్దని సెలక్షన్ కమిటీకి లేఖ రాసినట్టు సమాచారం.

వచ్చే నెలలో జరగబోయే దక్షిణాఫ్రికా పర్యటనకి తనని ఎంపిక చేయొద్దని, ఫిట్ నెస్ సాధించిన తరువాతే భారత జట్టు తరపున మ్యాచ్ లు ఆడుతానని చెప్పినట్లు తెలుస్తుంది.తాజాగా ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. కొంతమంది నెటిజన్లు హార్దిక్ పాండ్య నిర్ణయాన్ని సమర్ధించగా, మరికొంతమంది నువ్వు సెలెక్టర్లకు చెప్పేది ఏంటి నువ్వు వద్దని చెప్పకున్న వాళ్ళే నిన్ను జట్టులోకి తీసుకోరని కామెంట్స్ చేస్తున్నారు. డిసెంబర్ 17 నుండి మూడు టెస్ట్ లు, మూడు వన్డేలు, నాలుగు టీ20 మ్యాచ్ లు కోసం భారత జట్టు దక్షిణాఫ్రికాకి వెళ్లనుంది. అయితే తాజాగా ఓమిక్రాన్ వైరస్ కారణంగా ఈ సిరీస్ రద్దు అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story