Harbhajan Singh: ఏపీ ప్రజలను చూస్తే ఆనందంగా ఉంది : భజ్జీ

Harbhajan Singh: ఏపీ ప్రజలను చూస్తే ఆనందంగా ఉంది : భజ్జీ
x
Harbhajan Singh
Highlights

కరోనా మహమ్మారి దెబ్బకి దేశంలో ప్రస్తుతం లాక్‌డౌన్‌ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

కరోనా మహమ్మారి దెబ్బకి దేశంలో ప్రస్తుతం లాక్‌డౌన్‌ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. జనం రోడ్ల మీద తిరగకుండా 21 రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉండాలని చెప్పినా కొందరు మాత్రం పెడచెవిన పెడుతున్నారు. ఈ సందర్భంగా కొందరు నిబంధనలను ఉల్లంఘించి రోడ్లపైకి రావడమే కాకుండా పోలీసులపై దాడులకూ పాల్పడుతున్నారు.లాక్‌డౌన్‌ ప్రకటించగానే భారత జట్టు క్రికెటర్లంతా ఇళ్లకే పరిమితమయ్యారు. కుటుంబసభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతూ ఈ విశ్రాంతి సమయాన్ని ఆస్వాదిస్తున్నారు.అయితే కొందరు వ్యక్తులు నిబంధనలను ఉల్లంఘించి రోడ్ల మీదకు రావడంపై భారత్ జట్టు మాజీ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

దీనికి సంబంధించిన వీడియో ట్విటర్‌లో పోస్టు చేసిన భజ్జీ దాడి చేసిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మన ఆలోచనా దృక్పథాన్ని మార్చుకోవాలి. పోలీసుల జీవితాలను పణంగా పెట్టి మనల్ని కాపాడుతున్నారు. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. పోలీసులకు కూడా కుటుంబాలు ఉంటాయి. వాళ్లు దేశం కోసం పనిచేస్తున్నారు. మన భవిష్యత్‌ బాగుండాలంటే.. ఈ ఒక్కసారి ఇళ్లల్లో ఎందుకు వుండాలో ఆలోచించండి దయచేసి సవ్యంగా నడుచుకోండి' అని భజ్జీ ట్వీట్ చేశాడు.

మరో ట్వీట్లో ఏపీ ప్రజలను చూసి సంతోషంగా ఉందని భజ్జీ ట్వీట్ చేశాడు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories